పేరుకు తమిళుడే కానీ.. హీరోగా సిద్దార్థ్ వైభవం చూసింది తెలుగులోనే. అతడి తొలి చిత్రం ‘బాయ్స్’ తమిళ:లో కంటే తెలుగులోనే బాగా ఆడింది. ఆ ఫేమ్‌తో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో అవకాశం దక్కితే.. దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయి సిద్ధును తెలుగులో స్టార్‌ను చేసింది. తర్వాత ‘బొమ్మరిల్లు’తో తన కెరీర్ మరో స్థాయికి వెళ్లింది. కానీ ఆపై సిద్ధుకు ఆశించిన విజయాలు దక్కలేదు.
వరుస ఫ్లాపులతో ఫాలోయింగ్, మార్కెట్ అంతా దెబ్బ తీసుకున్నాడు. ఇక్కడ దాదాపుగా కెరీర్ క్లోజ్ అయిపోయింది. కొన్నేళ్ల పాటు సిద్ధు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం కావడం కూడా ఆగిపోయింది. మళ్లీ తెలుగు మార్కెట్లోకి ఎంటరవడానికి సిద్ధు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు కానీ ఫలితం ఉండట్లేదు. అనువాద చిత్రం ‘గృహం’ కానీ.. స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘మహాసముద్రం’ కానీ అతడి రాతను మార్చలేకపోయాయి.
ఇప్పుడు సిద్ధు మళ్లీ ఓ డబ్బింగ్ మూవీతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. ఆ చిత్రమే.. టక్కర్. కార్తీక్ జి.క్రిష్ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించాడు. సిద్ధు అంటే సాఫ్ట్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. కానీ ఈ సినిమా అతడి శైలికి కొంచెం భిన్నమే. మాస్ టచ్ ఉన్న పాత్ర చేశాడు సిద్ధు ఇందులో. తన లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ‘మజిలీ’ భామ దివ్యాంశ కౌశిక్ ఇందులో కథానాయిక. ట్రైలర్ చూస్తే ఎంటర్టైనింగ్‌గా సాగే క్రైమ్ డ్రామాలా కనిపించింది.
ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ వేరే రిలీజ్‌లు ఏవీ లేవు. సిద్ధు సినిమాకే ప్రయారిటీ కనిపిస్తోంది. పీపుల్స్ మీడియా అధినేతలు అభిషేక్ అగర్వాల్‌తో కలిసి సినిమాను రిలీజ్ చేస్తుండటంతో థఇయేటర్లు కావాల్సినన్ని దక్కుతున్నాయి. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ప్రేక్షకులకు వేరే ఆప్షన్లు కూడా కనిపించడం లేదు కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే.. మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సిద్ధు సందడి చూడొచ్చు.
This post was last modified on June 8, 2023 3:52 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…