Movie News

ఇంకో రామాయణం అవసరమా అధ్యక్షా

చూస్తుంటే బాలీవుడ్ రామాయణం ఫీవర్ లో మునిగి తేలేలా ఉంది. ఆదిపురుష్ కు విడుదల ముందే వస్తున్న స్పందన, ప్రేక్షకుల్లో కలుగుతున్న ఆసక్తిని చూసి అదే కథను తాము చెప్పాలన్న తాపత్రయం ఇతర దర్శక నిర్మాతల్లో పెరిగిపోతోంది. దంగల్ లాంటి స్పోర్ట్స్ డ్రామా  అద్భుతంగా తీసిన నితీష్ తివారి రఘురాముడి చరితాన్ని తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. నిజ జీవిత భార్యాభర్తలు రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారనే వార్త ప్రస్తుతం ముంబై మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ ఫలితం ముందే ఈ న్యూస్ రావడం గమనార్హం.

ఇంకో పెద్ద ట్విస్టు ఏంటంటే రావణాసురుడిగా కెజిఎఫ్ ఫేమ్ యష్ ని ట్రై చేస్తారట. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ సమయం ఎంత వృధా అవుతున్న లెక్కచేయని యష్ విలన్ షేడ్స్ ఉండే రావణుడిగా కనిపించడం దాదాపు అసాధ్యం. అల్లు అరవింద్, మధు మంతెనలు నిర్మాణ భాగస్వాములుగా ఉంటారని కూడా ప్రచారమవుతోంది. గతంలో ఇదే తరహాలో రకరకాల కాంబినేషన్లతో ప్రచారాలు జరిగాయి కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. మలయాళంలోనూ ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ట్రై చేసి వర్కౌట్ కాదని సైలెంట్ అయ్యారు

ఎంత అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతున్నా మరీ ఇన్నేసి రామాయణ సినిమాలు రావడం సేఫ్ కాదు. ఎందుకంటే గ్రాఫిక్స్ ఎన్ని వాడినా మూల కథను మార్చడం అసాధ్యం. క్రియేటివ్ లిబర్టీ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఏ చిన్న పొరపాటు చేసినా మనోభావాలు దెబ్బ తింటాయి. అలాంటప్పుడు మళ్ళీ అదే గాథను తీసుకోవడం సాహసమే. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది. ఆదిపురుష్ రిజల్ట్ వచ్చాక నిర్ణయం మారుతుందేమో. రన్బీర్ కపూర్ సంగతేమో కానీ పెర్ఫార్మన్స్ కోణంలో చూసుకుంటే సీతగా అలియా భట్ మంచి ఛాయస్ అయ్యేలా ఉంది.

This post was last modified on June 8, 2023 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

3 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

3 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

4 hours ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

5 hours ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

5 hours ago