నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు నలభై ఎనిమిది గంటల ముందే అభిమానులకు కానుకల పర్వం మొదలైపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బి కె 108 టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు అధికారికంగా విడుదల చేశారు. భగవంత్ కేసరి పేరుతో ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూటయ్యేలా ఉంది. కాస్త గుబురుగా ఉన్న తెల్ల గెడ్డంతో పెద్దరికం తొణికిసలాడే స్టయిలిష్ అవుట్ ఫిట్ తో ఫ్యాన్స్ నే కాదు సగటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంది. అందరూ ఊహించినట్టు కాకుండా సైడ్ లుక్ తో ఆయుధం నేలలో దిగబడే స్టిల్ తో సర్ప్రైజ్ చేశారు
టైటిల్ ని కాస్త జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే మూడు సింహాల చిహ్నం ఉంది. అంటే బాలయ్య పాత్ర పోలీస్ ఆఫీసర్ గా కనిపించే క్లూ ఇచ్చారు. అయితే గెడ్డంని బట్టి రిటైర్ అయ్యాక జరిగే కథగా మొదలుపెట్టొచ్చు. ఫన్ ఎంటర్ టైనర్స్ ఇవ్వడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మొదటిసారి బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు తన మార్కు పటాస్ తరహా కామెడీని ఇందులో జొప్పిస్తారని టాక్. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఆల్బమ్ కి రెడీ అవుతున్నాడు
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భగవంత్ కేసరిలో శ్రీలీల ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆ క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దసరా పండగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్టర్ లో ప్రస్తావించలేదు. మార్పు ఉండకపోవచ్చు కానీ ఎందుకని హైలైట్ చేయలేదో వేచి చూడాలి. బ్యాక్ టు బ్లాక్ బస్టర్లతో మంచి స్పీడ్ మీదున్న బాలకృష్ణకు ఇది మరో బంపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్లాప్ మొహమే చూడని అనిల్ రావిపూడి నుంచి అంతకు మించే రావొచ్చేమో
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…