ఒకే ఒక్క కన్ను గీటే వీడియోతో మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఒరు అడార్ లవ్ అనే సినిమా మేకింగ్ దశల ఉండగా.. అందులోంచి రిలీజ్ చేసిన వీడియోలో అమె కన్ను గీటే దృశ్యానికి కుర్రాళ్లకు కుదేలైపోయారు. అప్పటిదాకా ఎన్నో సినిమాల్లో కన్ను గీటే దృశ్యాలు చూసి ఉంటారు కానీ.. ప్రియ అంత ఎఫెక్టివ్‌గా ఎవరూ చేసి ఉండరనడంలో సందేహం లేదు.
ఆ వీడియో ఒక్కటే సినిమాకు బోలెడంత ప్రమోషన్ చేసి పెట్టింది. సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో ఆ సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమాలో విషయం లేక బోల్తా కొట్టింది. అయినప్పటికీ ప్రియ మాత్రం ఈ వీడియో వల్ల వచ్చిన పాపులారిటీతో సినిమా, మోడలింగ్ అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో ఆమె చెక్, ఙష్క్ అనే రెండు సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
కాగా తనకు పాపులారిటీ తెచ్చిన వీడియో గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందులో కన్ను గీటే ఐడియా తనదే అని చెప్పడం వివాదాస్పదం అయింది. ఒరు అడార లవ్ దర్శకుడు ఒమర్ లులు వెంటనే లైన్లోకి వచ్చేశాడు. ఈ ఐడియాకు, ప్రియకు సంబంధం లేదని అతను తేల్చేశాడు. ప్రియను పిచ్చి పిల్ల అని సంబోధిస్తూ.. ఐదేళ్ల ముందు జరిగిన విషయం కాబట్టి ప్రియ మరిచిపోయి ఉంటుందని.. ఆమె జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మందులు వాడితే మంచిదని అతను కౌంటర్ వేశాడు.
గతంలో ఒరు అడార్ లవ్ ప్రమోషన్ల సందర్భంగా.. కన్ను గీటే ఐడియా ఆ చిత్రంలో నటించిన రోషన్‌దే అని ఆమె ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను ఒమర్ లులు షేర్ చేశాడు. రోషన్ కన్నులు ఎగరేయడం చూసి.. దాన్ని ఇంప్రొవైజ్ చేసి అలా కన్ను గీటినట్లు ప్రియ ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. కాగా వింక్ వీడియోను మినహాయిస్తే నటన పరంగా ప్రియలో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో ఆమె కెరీర్ ఊపందుకోలేదు.
This post was last modified on June 8, 2023 9:21 am
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…