ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే శంకర్ కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు. చెరో పది రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తూ రెండు ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నాడు శంకర్. అయితే ఈ రెండు సినిమాలకు కామన్ లింకు ఒకటి ఉంది. దర్శకుడు శంకర్ కాకుండా ఈ రెండు సినిమాలకు వర్క్ చేస్తున్న ఓ నటుడు ఉన్నాడు. అతనే ఎస్ జే సూర్య.
డైరెక్టర్ కం యాక్టర్ ఎస్ జే సూర్య ‘గేమ్ ఛేంజర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో శ్రీకాంత్ ఒక విలన్ అయినప్పటికీ మరో విలన్ గా సూర్య కనిపిస్తాడట. ఇప్పటికే చరణ్ , సూర్య మీద వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తుంది. తాజాగా ఎస్ జే సూర్య ‘భారతీయుడు 2’ లో మెయిన్ విలన్ అనే న్యూస్ బయటికొచ్చింది. దీంతో శంకర్ తాను తీస్తున్న రెండు భారీ సినిమాళ్లో ఒకే విలన్ ను పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది.
‘స్పైడర్’ లో ఎస్ జే సూర్య తన సైకో విలనిజంతో మెప్పించాడు. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సూర్య కి ఆ సినిమా తెలుగులో పనవ్వలేదు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాళ్లో సూర్య ఎలాంటి వెరీయేషన్ చూపిస్తాడో ? ఎలాంటి విలనిజం పండిస్తాడో మరి.
This post was last modified on June 8, 2023 9:10 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…