ఆలూ లేదూ చూలు లేదు సామెత చెప్పినట్టు అసలు ఇంకా స్క్రిప్టే ఫైనల్ కానీ సినిమాల్లో హీరోయిన్ సెలక్షన్ గురించిన వార్తలు భలే విచిత్రంగా ఉంటాయి. ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సంగతి తెలిసిందే. సలార్ రిలీజ్ కాగానే ఇతను తారక్ కి ఫైనల్ వెర్షన్ వినిపించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాడు. అప్పటిదాకా క్యాస్టింగ్ గురించిన ఆలోచనే లేదు. అయినా కూడా ప్రియాంకా చోప్రాని యంగ్ టైగర్ కి జోడిగా తీసుకునే ఆలోచన జరుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని సోషల్ మీడియా పుకార్లు గుప్పుమన్నాయి.
వాస్తవానికి అదేమీ లేదట. నిజానికి ప్రియాంకా చోప్రాని బాలీవుడ్ లోనే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఎవరూ తీసుకోవడం లేదు. ఎంత గ్లామర్ షో చేసినా కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్, అలియా భట్ లాంటి న్యూ జనరేషన్ తో తను సరితూగడం లేదన్నది వాస్తవం. అందుకే ప్రియాంకా చోప్రా సైతం చాలా తెలివిగా హాలీవుడ్ వెబ్ సిరీస్ ల వైపు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వయసు సమస్య కాదు కాబట్టి నాలుగు పదుల ఏజ్ లోనూ సిటాడెల్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతికొచ్చాయి. డాన్ 3ని తీసే ఆలోచనలో ఫర్హాన్ అక్తర్ సైతం ఇప్పుడు ప్రియాంకను వద్దనుకుని కొత్త ఆప్షన్లు చూస్తున్నారు
అలాంటిది జూనియర్ తో జట్టు కట్టించడం కష్టమే. ఏదైనా కీలక పాత్ర అంటే ఓకే కానీ తారక్ ప్రియాంకల జోడి తెరమీద అంతగా ఆనదు. ఎప్పుడో రామ్ చరణ్ తో జంజీర్ చేసినప్పుడు ఓకే కానీ అది వచ్చే దశాబ్దం అయ్యింది. దేవర షూటింగ్ లో బిజీ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ఫారిన్ ట్రిప్ కోసం కొంత బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ ఉండనుంది. హృతిక్ రోషన్ తో చేయబోయే వార్ 2 కోసం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడు. ప్రశాంత్ నీల్ మాత్రం అక్టోబర్ నుంచి తారక్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు
This post was last modified on June 7, 2023 7:46 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…