తిరుపతిలో కళ్ళు చెదిరిపోయేలా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలను మించి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ని పబ్లిక్ స్టేజి మీద చూసుకున్న అభిమానులు మురిసిపోయారు. మైకు అందుకున్న డార్లింగ్ ఎక్కువ సేపు మాట్లాడతాడని ఆశించారు. అయితే స్వీట్ అండ్ సింపుల్ గా స్పీచ్ ఇచ్చింది కాసేపే అయినా వాళ్ళు కోరుకున్న ముచ్చట్లయితే చెప్పాడు. పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చి చెప్పే చేసుకుంటానని అది కూడా ఏడుకొండల వాడి సన్నిధిలో జరుపుకుంటామని హామీ ఇచ్చాడు. అయితే అమ్మాయి గురించి చెప్పలేదు లెండి.
తక్కువ మాట్లాడినా ఇకపై ఎక్కువ సినిమాలు ఇస్తానని ఏడాదికి కనీసం రెండు లేదా మూడు కూడా వచ్చే అవకాశాలున్నాయనే సంకేతం ఇచ్చాడు. ఆదిపురుష్ జూన్ 16 వస్తుంది. సలార్ సెప్టెంబర్ 28 ఆల్రెడీ లాక్ చేసుకుంది. అన్నీ సవ్యంగా పూర్తయితే ప్రాజెక్ట్ కె వచ్చే జనవరి 12న దిగుతుంది. అంటే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటలు కాదు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా వేగంగా పరుగులు పెడుతోంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ని యానిమల్ రిలీజ్ తర్వాత మొదలుపెడతారు.
వివాహం సంగతేమో కానీ ప్రభాస్ సినిమాల మీద మాత్రం ఫుల్ కమిట్ మెంట్ తో ఉన్నాడు. ఆదిపురుష్ మీద మొదట్లో వచ్చిన నెగటివ్ వైబ్రేషన్స్ క్రమంగా తగ్గిపోవడంతో ఆ ఆనందం మోహంలో కనిపిస్తోంది. పైగా బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల బిజినెనే నూటా ఎనభై కోట్లకు పైగా జరగడం నేషన్ వైడ్ టాపిక్ అయ్యింది. ఇంకో తొమ్మిది రోజులు ఉన్న నేపథ్యంలో టి సిరీస్ బృందం అటు నార్త్ లోనూ ప్రమోషన్ల వేగం పెంచబోతోంది. ముంబైలో ఈ వారంలోనే ఒక ఈవెంట్ ఉండొచ్చు. సాధ్యం కానీ పక్షంలో ప్రెస్ మీట్లు ఫ్యాన్స్ మీట్లు ప్లాన్ చేస్తారు
This post was last modified on June 7, 2023 2:00 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…