మైత్రి బాకీ తీర్చబోతున్న రవితేజ ?

కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లకు హీరోలు బాకీ ఉంటుంటారు. తీసుకున్న రెమ్యునరేషన్ కి సరైన హిట్ పడకపోతే అది బాకీ కిందకే వస్తుంది. రవితేజ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఓ బాకీ ఉన్నాడు. ఆ మధ్య శ్రీను వైట్ల , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబోలో మైత్రి సంస్థ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా నిర్మించింది. ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ రిజల్ట్ తర్వాత రవితేజ మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరితే తప్పకుండా ఓ సినిమా చేస్తానని నిర్మాతలకు మాటిచ్చాడట.

ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కోసం మైత్రి నిర్మాతలు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారట. రీసెంట్ గా తమ బేనర్ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇనసైడ్ న్యూస్. రవితేజతో ‘డాన్ శీను’ తీసి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత మాస్ మహారాజ్ తో ‘బలుపు’ అనే మరో సినిమా తీసి రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.

తాజాగా రవితేజకి గోపీచంద్ ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు రైటింగ్ వర్క్ జరుతుంది. గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరి హీరోలతో బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న మైత్రి సంస్థ రవితేజతో ఈసారైనా సక్సెస్ కొడుతుందా ? చూడాలి.