గ్లామర్ షో విషయంలో కొందరు హీరోయిన్లు మడికట్టుకొని కూర్చుంటారు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కొన్నాళ్ళ క్రితం నాగ చైతన్య ‘ప్రేమమ్’ తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన మల్లు బ్యూటీ అనుపమ మొదటి సినిమా నుండే పద్దతిగల పాత్రలకే తన ఓటని చూసీ గా ఉంది. అనుపమ హీరోయిన్ గా ఎన్ని లవ్ స్టోరీస్ చేసినా గ్లామర్ షో విషయం ఎక్కడా హద్దు దాటలేదు. ప్రతీ సినిమాలో హోమ్లీ గానే కనిపించి ఆకట్టుకుంది.
స్కిన్ షో చేయడం ఇష్టం లేక అనుపమ కొన్ని సినిమాలు కూడా వదిలేసుకుందనే టాక్ ఉంది. ఇప్పుడు అమ్మడు టిల్లు కోసం ఒక మెట్టు దిగక తప్పలేదు. డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో సిద్దు దానికి టిల్లు స్క్వేర్ టైటిల్ తో సీక్వెల్ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టిను కాకుండా అనుపమను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాలో నేహా శెట్టి తన గ్లామర్ షో హాట్ గా కనిపిస్తూ యువతను ఎట్రాక్ట్ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
నేహా శెట్టి చేసిన రాధిక పాత్రకు మించి అనుపమ కేరెక్టర్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. సినిమాలో అనుపమ ఫర్ ది ఫస్ట్ టైమ్ గ్లామర్ షో చేయనుందని , రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోనుందని గట్టిగా చెప్తున్నారు. తాజాగా విడుదల చేసిన రిలీజ్ పోస్టర్ లో అనుపమ హాట్ గా స్టిల్ తో ముద్దు సన్నివేశంలో కనిపించింది. మరి టిల్లు కోసం తప్పక దిగొచ్చిన అనుపమ తన గ్లామర్ షోతో ఎలా మెప్పిస్తుందో వైట్ అండ్ సీ.
This post was last modified on June 6, 2023 6:57 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…