ఆదిపురుష్ టీం నిన్న చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఇలా చేస్తున్నామని ‘ఆదిపురుస్’ టీం ప్రకటించింది. ఇది వినూత్నమైన, తెలివైన ప్రమోషనల్ ఎత్తుగడ అంటూ చాలామంది కొనియాడుతున్నారు. ఐతే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలా చేయడం కొత్త అయితే కాదు.
తెలుగులోనే కొన్ని సినిమాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్ ప్రయోగాలు చేశారు. 1943లోనే భక్త పోతన సినిమా టీం.. బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇక ‘అన్నమయ్య’ సినిమా ఆడుతున్న థియేటర్లలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టించారు అప్పట్లో. అంతకుముందు ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాకు కూడా ఇలాగే చేశారు. 90వ దశకంలో రిలీజైన ‘అమ్మోరు’ సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ ముందూ మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెడితే.. జనం దాన్నో గుడిలాగా భావించి థియేటర్ల నుంచి బయటికి వచ్చాక మొక్కుకుని వెళ్లడం అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఇదే కోవలో, కొంచెం భిన్నంగా హనుమంతుడి కోసం ఖాళీ సీట్ ఆలోచన చేసింది. ఒకప్పటితో పోలిస్తే జనాలు సినిమాల పట్ల అంత ఎమోషనల్‌గా లేని ఈ రోజుల్లో ‘ఆదిపురుష్’ టీం ఎత్తుగడ ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చూడాలి మరి. ప్రభాస్, కృతి సనన్ రాముడు-సీతగా కనిపించనున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ రూపొందించాడు. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
This post was last modified on June 6, 2023 2:18 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…