ఏదో అభిమానులు ఈగోలకు పోయి మా సినిమానే గొప్పదని సోషల్ మీడియాలో హంగామా చేయడం తప్పించి నిజంగా హీరోల మధ్య ఎలాంటి ద్వేషపూరిత వాతావరణం ఉండదు. పరస్పరం అవతలి సినిమాలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం కేవలం తాత, బాబాయ్ ల చిత్రాలే చూస్తూ ఉండడుగా. అలాంటప్పుడు ఇతరులు నటించిన వాటిలో అందులోనూ సీనియర్లలో ఏవి బాగా ఇష్టపడ్డాడనే ఆసక్తి కలగడం సహజం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ టైంలో ఓ వెబ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది.
దాంట్లో స్వయంగా చెప్పిన ప్రకారం తారక్ కు ఇష్టమైన మెగా మూవీ రుద్రవీణ. ఇది 1988లో రిలీజయ్యింది. తల్లి పేరు మీద నాగబాబు నిర్మాతగా చిరు స్వంత బ్యానర్ మొదలుపెట్టిన కొత్తలో డెబ్యూ ప్రొడక్షన్ ఇది. కులాల అంతరాల గురించి సంగీతానికి ముడిపెడుతూ దర్శకుడు బాలచందర్ రుద్రవీణని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. యముడికి మొగుడు లాంటి కమర్షియల్ మసాలాలతో మాస్ ని ఊపేస్తున్న టైంలో చిరు చేసిన సినిమా కావడంతో రుద్రవీణ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. కానీ మెగాస్టార్ లోని బెస్ట్ యాక్టర్ బయటికి వచ్చింది ఇందులోనే.
ఈ ముచ్చట కూడా జూనియరే చెప్పాడు. నటులు తమ హీరో స్టేచర్ ని పక్కనపెట్టి నటతృష్ణను తీర్చుకోవడం కోసం రిస్కులు చేస్తారని స్వర్గీయ ఎన్టీఆర్, చిరంజీవి ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ తో సంబంధం లేకుండా కొన్ని రెఫరెన్సులు ఇచ్చారని మెచ్చుకున్నాడు. ఇప్పుడీ వీడియో ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. తారక్ కు సైతం కళాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా ఇమేజ్ ప్రతిబంధకంలో రెండేళ్లకో సినిమా చేయడమే కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో రుద్రవీణ లాంటి సోషల్ మెసేజ్ మూవీస్ చేయడం కష్టమే. తనకే కాదు స్టార్ హీరోలందరికీ ఇదే సమస్య
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…
ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…
థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…