మిల్కీ బ్యూటీ తమన్నాకు బోలెడు సీనియారిటీ వచ్చేసినా ఆఫర్లకు మాత్రం కొదవ ఉండటం లేదు. వెంకటేష్ తో ఎఫ్3 చేసిన కొంతకాలానికే చిరంజీవి భోళా శంకర్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే రజనీకాంత్ జైలర్ లోనూ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఒక పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లతో కాల్ షీట్స్ అంత సులభంగా దొరికేలా లేవు. గ్లామర్ విషయంలో ఇప్పటిదాకా ఎక్కువ ఎక్స్ పోజింగ్ కానీ ఇంటిమసీ సీన్లు కాని చేయని తమన్నా తాజాగా జీ కర్దే అనే వెబ్ సిరీస్ కోసం మొహమాటాలన్నీ పక్కన పెట్టేసింది. ఈ నెల 15 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న జీ కర్దే ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. బూతులు వాడేశారు. కొంతం ఘాటుగానే అనిపించే బెడ్ రూమ్ సీన్స్ లో తమన్నాను నటింపజేశారు. ప్రేమ స్నేహం బంధం ఈ మూడు అంశాల చుట్టూ హై ప్రొఫైల్ రిచ్ ఫ్యామిలీస్ లో జరిగే సంఘటనల ఆధారంగా అరుణిమ శర్మ దీన్ని రూపొందించారు. ఏడుగురు స్కూల్ ఫ్రెండ్స్ తమ వయసు ముపై దాటేసి ఒక పెళ్లి వేడుక కోసం కలుసుకున్నాక జరిగే పరిణామాల బ్యాక్ డ్రాప్ లో జీ కర్దే సాగుతుంది. ధనికులైన కుటుంబాల నేపథ్యం కావడంతో మిడిల్ క్లాస్ జనాలకు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.
ఇది పక్కనపెడితే తమన్నా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో నో లిమిట్స్ అని దీని ద్వారా చెప్పకనే చెప్పింది. అయినా వెబ్ సిరీస్ లంటే బిడియాలు పక్కన పెట్టేయాల్సిందే. తమన్నా చేస్తోంది కూడా ఇదే. అందం అభినయం విషయంలో ఇంకా చురుకుగానే ఉన్న మిల్కీ బ్యూటీకి సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరక్కవడం పెద్ద ప్లస్ గా మారుతోంది. బాలకృష్ణ భగవత్ కేసరిలో ఒక స్పెషల్ సాంగ్ కోసం అడిగారనే టాక్ వచ్చింది కానీ తర్వాత అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. సో జీ కర్దేలో రొమాన్స్ డోస్ ఎంత ఉందో తెలియాలంటే పది రోజులు ఆగాలి.
This post was last modified on June 6, 2023 11:22 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…