‘‘ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ, తేజల సినిమాల కంటే వాళ్ల ఇంటర్వ్యూలు చాలా బాగుంటున్నాయి’’.. ఇటీవల ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఇది. చాలామందికి ఇదే ఫీలింగ్ కలిగి ఉంటే ఆశ్చర్యం ఏమీ లేదు. రామ్ గోపాల్ వర్మ కాస్త చెప్పుకోదగ్గ సినిమా తీసి చాలా ఏళ్లయిపోయింది. గత కొన్నేళ్లలో ఆయనెంత చీప్ కంటెంట్ సినిమాలు తీశారో తెలిసిందే. కానీ ఇప్పటికీ వర్మ ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చాడంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆయన లాజిక్‌లే వేరుగా ఉంటాయి.
వర్మతో పోలిస్తే ఆయన శిష్యుడైన తేజ శైలి కొంచెం డిఫరెంట్. వర్మలా ఆయన వితండవాదం చేయరు. కానీ ఓపెన్‌గా మాట్లాడతారు. ఆయన ఇంటర్వ్యూలేవైనా మొదలుపెడితే.. పూర్తయ్యే వరకు వాటికి అతుక్కుపోతాం. రకరకాల విషయాలపై అంత ఆసక్తికరంగా మాట్లాడతారు ఆయన. తన కొత్త సినిమా ‘అహింస’కు ముందు తేజ ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ సూపర్ హిట్టే. అలాగే తన సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి.
ఐతే మాటల వరకు సూపర్ అనిపించే తేజ.. గురువు లాగే చేతల విషయానికి వచ్చేసరికి నిరాశ పరుస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన తర్వాత దశాబ్దంన్నరకు పైగా హిట్ ఇవ్వలేకపోయాడు. మధ్యలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ‘సీత’ సినిమాకు వచ్చేసరికి మళ్లీ ట్రాక్ తప్పారు.
ఇప్పుడు ‘అహింస’ సినిమా చూసిన వాళ్లు.. ‘సీత’నే ఎంతో నయం అంటున్నారు. అంత ముతక కథతో సినిమా తీశారు తేజ. ఇంటర్వ్యూల్లో తేజ మాటలు వింటే చాలా అప్‌డేటెడ్‌గా ఉన్నారు అనిపిస్తుంది. కానీ సినిమా విషయానికి వచ్చేసారికి ఆయన చాలా ఔట్ డేటెడ్‌గా అనిపిస్తున్నారు. తనకు తాను గీసుకున్న హద్దుల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అవే పాత కథలు.. అదే పాత నరేషన్. రానాతో చేస్తానంటున్న కొత్త సినిమాతో అయినా ఆయన వైవిధ్యం చూపిస్తారేమో చూడాలి.
This post was last modified on June 6, 2023 6:21 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…