మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బాబీ మరో జాక్ పాట్ కొట్టేశాడు. నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ బాలయ్య పుట్టినరోజు జూన్ 10న రానుంది. గతంలో బాబీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని వార్త వచ్చింది కానీ అదంతా గాలి మాటేనని తర్వాత క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే ఇన్ని నెలలు సైలెంట్ గా ఉన్న బాబీకి బాలయ్య రూపంలో ఒక పవర్ ఫుల్ మాస్ హీరో దొరికితే అంతకన్నా ఏం కావాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ కాంబోలో మూవీ గురించి గతంలో ఆన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు పరస్పరం హింట్ ఇచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ ఎవరన్నది లాక్ చేయలేదు. బాబీ కూడా తొందరపడకుండా సరైన హీరో దొరకాలనే ఉద్దేశంతో మౌనంగా తన పని తాను చేసుకోవడం సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం భగవత్ కేసరి షూటింగ్ తో బిజీగా ఉన్న బాలయ్య ఇది పూర్తయ్యాక చేసే ఎన్బికె 109 బాబీదే అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది రూపొందనుంది.
ఈ లెక్కన ఆదిత్య 369 సీక్వెల్ తో పాటు పూరి జగన్నాధ్ తో బాలయ్య చేయాల్సిన సినిమాలు ఇంకా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. సితార సంస్థ కాబట్టి ఎలాగూ కథ విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది. బాబీకి ఎంత అనుభవమున్నా గురూజీ సలహాలు ఉపయోగపడతాయి. సంగీత దర్శకుడిగా తిరిగి తమన్ మళ్ళీ రిపీట్ అవుతాడా లేక బాబీ రెగ్యులర్ ఫేవరెట్ దేవిశ్రీ ప్రసాద్ వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. షూటింగ్ గట్రా మొదలవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 2024 సమ్మర్ ని విడుదలకు లక్ష్యంగా పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు ఇంకో అయిదు రోజుల్లో వచ్చేస్తాయి
This post was last modified on June 5, 2023 5:49 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…