భారీ బడ్జెట్ పెట్టి ఎంతో రిస్క్ చేసి తీసిన ఓ పెద్ద సినిమా వస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర కూడా అనుకూల పరిస్థితులు నెలకొనడం కీలకం. ఆ విషయంలో ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’కు భలేగా కలిసొస్తోందనే చెప్పాలి. ముందు అనుకున్నట్లు సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏమై ఉండేదో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
వేసవిలో ఏ పెద్ద సినిమా లేక ప్రేక్షకులు కరవులో ఉన్నారు. దీనికి తోడు ‘ఆదిపురుష్’ రావడానికి ముందు కొన్ని వారాల పాటు బాక్సాఫీస్‌లో స్తబ్దత కనిపిస్తోంది. ఏ సినిమా కూడా థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షించలేకపోతోంది. ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు వారం ముందు వస్తున్న టక్కర్, విమానం సినిమాల మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. ప్రేక్షకుల దృష్టంతా ‘ఆదిపురుష్’ మీదే కేంద్రీకృతం అయి ఉంది.
‘ఆదిపురుష్’ విడుదలయ్యే వీకెండ్లో తెలుగులోనే కాక వేరే భాషల్లో కూడా చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. తర్వాతి వారం కూడా పోటీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నెలాఖర్లో నిఖిల్ సినిమా ‘స్పై’ ఓ మోస్తరు అంచనాలతో రాబోతోంది. ‘ఆదిపురుష్’ అప్పటి వరకు నిలబడితే కలెక్షన్లు చాలా పెద్ద రేంజికే వెళ్లిపోతాయి. మొత్తంగా చూస్తే ప్రేక్షకుల మూడ్, బాక్సాఫీస్ పరిస్థితులు ‘ఆదిపురుష్’కు పూర్తి అనుకూలంగా ఉన్నాయన్నది స్పష్టం.
ఇక ఔట్ పుట్ ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇంకొక్క రోజులోనే ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతి వేదికగా భారీగా చేయబోతున్నారు. అప్పుడే రిలీజ్ ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌తో సినిమాకు మరింత హైప్ పెంచితే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి. రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులతోనే ఆ మేర బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 5, 2023 7:43 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…