Movie News

చిరు స్పీడ్ గురించి కామెంట్లా.. హ‌వ్వ‌

మెగాస్టార్ చిరంజీవి లాంటి డ్యాన్స‌ర్ తెలుగు సినిమా కాదు.. ఇండియ‌న్ సినిమా కాదు.. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లోనే ఉండ‌డు అంటే అతిశ‌యోక్తి ఏమీ కాదు. చిరును మించి వేగంగా డ్యాన్స్ చేసేవాళ్లు, అత్యంత క‌ష్ట‌మైన స్టెప్పులు వేసే వాళ్లు ఉండొచ్చు. కానీ ఆయ‌నంత అందంగా, చూడ‌ముచ్చ‌ట‌గా నృత్యం చేయ‌డం ఇంకెవ‌రికీ సాధ్యం కాదు. ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్‌గా, దేశంలో నంబ‌ర్ వ‌న్ డ్యాన్స్ మాస్ట‌ర్‌గా పేరున్న ప్ర‌భుదేవా సైతం చిరును మించిన డ్యాన్స‌ర్ లేడ‌ని అంటాడు.

చిరు నృత్య ప్ర‌తిభ‌ను చెప్ప‌డానికి కోకొల్ల‌లుగా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. సినిమాల్లో ప‌దేళ్ల విరామం వ‌చ్చినా.. వ‌య‌సు 60 దాటినా రీఎంట్రీలో ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో త‌న‌దైన గ్రేస్ చూపించ‌డం చిరుకే చెల్లింది. ఐతే ఎంతైనా వయ‌సు పెరిగే కొద్దీ డ్యాన్సుల్లో స్పీడు త‌గ్గడం మామూలే. చిరు నృత్యంలో కూడా ఈ మ‌ధ్య కొంచెం వేగం త‌గ్గింది.

తాజాగా చిరు కొత్త సినిమా భోళా శంక‌ర్ నుంచి భోళా మేనియా పాట రిలీజైంది. మంచి బీట్ ఉన్న పాటే ఇచ్చాడు మ‌ణిశ‌ర్మ త‌న‌యుడైన‌ యువ‌ సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్. లిరిక‌ల్ వీడియోలో చిరు వేసిన రెండు స్టెప్స్ కూడా చూపించారు. అవి సింపుల్‌గా ఉంటూనే చిరు ప్రత్యేక‌త‌ను చూపించాడు. ఆ స్టెప్పుల‌కు త‌న‌దైన గ్రేస్ జోడించి చిరు అభిమానుల‌ను అల‌రించాడు. కానీ కొంద‌రేమో చిరు డ్యాన్సుల్లో వేగం త‌గ్గింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఐతే చిరు వ‌య‌సిప్పుడు 67 ఏళ్లు అన్న సంగ‌తి మ‌రువ‌రాదు.

మామూలుగా ఈ వ‌య‌సులో లేచి తిర‌గ‌డ‌మే క‌ష్ట‌మ‌వుతుంది మామూలు జ‌నాల‌కు. సినిమాల్లో ఉన్న వాళ్లు కూడా ఈ వ‌య‌సుకు వ‌స్తే డ్యాన్సులు, ఫైట్లు అన్నీ ప‌క్క‌న పెట్టి సింపుల్ క్యారెక్ట‌ర్లు చేస్తుంటారు. కానీ చిరు ఈ వ‌య‌సులో కూడా ఫిట్‌గా ఉంటూ.. కుర్రాడిలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇంకా డ్యాన్సులు, ఫైట్ల‌తో అభిమానుల‌ను అల‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ వ‌య‌సులో ఇంత క‌ష్ట‌ప‌డుతున్న హీరో ఏ ఇండ‌స్ట్రీలోనూ క‌నిపించ‌డ‌దు. అందుకు ఆయ‌న్ని కొనియాడాల్సింది పోయి కంప్లైంట్లు చేయ‌డ‌మేంటో?

This post was last modified on June 5, 2023 1:19 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago