Movie News

లలితా జ్యువెలర్స్ దొంగగా కార్తీ

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే కార్తీ కొత్త సినిమా జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. పాతక శాతం మినహాయించి  షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆ మధ్య  వదిలిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. సర్దార్ తరహాలో కార్తీ ఇందులో విభిన్నమైన గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నాడు. రాజుమురుగన్ దర్శకుడు. దీనికి సంబంధించిన ఒక కీలక లీక్ ఆసక్తి రేపేలా ఉంది.

జపాన్ ఒక నిజమైన దొంగ బయోపిక్ గా రూపొందుతోందట. అతని పేరు తిరువరూర్ మురుగన్. పేరు మోసిన గజ దొంగ. 2019 తిరుచినాపల్లి జిల్లాలో ఉన్న మూడు అంతస్థుల లలితా జ్యూవెలరీ షో రూమ్ ని కొల్లగొట్టిన కేసులో ప్రధాన నిందితుడు. సుమారు 13 కోట్ల రూపాయల విలువైన సొత్తుని లూటీ చేశాడనే అభియోగం మీద పోలీసులు ఇతన్ని అతి కష్టం మీద పట్టుకున్నారు. శిక్ష అనుభవిస్తున్న క్రమంలో 2020 ఎయిడ్స్ వచ్చి కారాగారంలోనే మృతి చెందాడు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో గ్యాంగులను ఏర్పాటు చేసి ఎన్నో చోరీలకు పాల్పడి కోట్లాది డబ్బును సంపాదించాడు

ఇతన్ని స్ఫూర్తిగా తీసుకునే జపాన్ కథ రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే ఎంటర్ టైన్మెంట్ ప్లస్ కమర్షియల్ యాంగిల్ లో అభిమానుల అంచనాలకు తగ్గట్టు మార్చారు. కానీ క్లైమాక్స్ మాత్రం యథాతధంగా కాకుండా సుఖాంతం చేద్దామనే రాజు మురుగన్ సూచనతో కార్తీ విభేదించి సహజత్వం కోసం ముగింపు అలా ఉంచుదామని అన్నట్టు చెన్నై టాక్. దీపావళికి రిలీజ్ కాబోతున్న జపాన్ తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్బింగ్ కానుంది. కార్తీకి మనదగ్గర  సోలో హిట్టు దక్కి చాలా రోజులయ్యింది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వలేదు 

This post was last modified on June 5, 2023 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago