Movie News

టాక్ తేడా ఉన్నా వసూళ్లు బాగున్నాయి

పఠాన్ తర్వాత ఆ స్థాయి కాదు కదా కనీసం అందులో సగం కూడా అందుకోలేక హిట్టు కోసం తపించిపోతున్న బాలీవుడ్ బాక్సాఫీస్ ని యావరేజ్ ఎంటర్ టైనర్లే ఆదుకుంటున్నాయి. ఆ మధ్య తూ ఝూటి మై మక్కర్ తొలుత విమర్శకుల కామెంట్లకు గురైనా అందులో ఉన్న రొమాన్స్, కామెడీ, శ్రద్ధా కపూర్-రన్బీర్ కపూర్ కెమిస్ట్రీ వంద కోట్లను సులభంగా దాటించేశాయి. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. మొన్న శుక్రవారం జర హట్కే జర బచ్కె రిలీజయ్యింది. విక్కీ కౌశల్-సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ రామ్ కామ్ కి ట్రైలర్ టైంలో చాలా నెగటివిటీ వచ్చింది.

విడుదలయ్యాక మాత్రం వసూళ్లు ఆశించిన దానికన్నా బాగానే ఉన్నాయని ముంబై టాక్. కథ లైన్ పరంగా బాగానే ఉంటుంది. కపిల్ దూబే(విక్కీ కౌశల్)యోగ శిక్షకుడు. మహా పిసినారి. భార్య సౌమ్య చావ్లా(సారా అలీఖాన్)కోచింగ్ క్లాసుల టీచర్. అయితే ఆదాయాలు సరిపోక ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించిన స్వంత ఇంటి స్కీంని వాడుకోవడం కోసం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది ఆసలు డ్రామా. మరి ఈ జంట చివరికి ఎలా తమ లక్ష్యం నెరవేర్చుకున్నారనేది స్టోరీ

ఒకరకంగా ఇది బాపుగారి పెళ్లి పుస్తకం లైనే. కాకపోతే తెలివిగా ఇంకో యాంగిల్ లో రాసుకున్నారు దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్. హాస్యం బాగానే పండినా ఇరిటేట్ చేసే సన్నివేశాలు, కిక్ ఇవ్వని పాటలు, అవసరం లేని ల్యాగ్ పంటి కింద రాళ్ళలా అడ్డం పడతాయి. అయినా సరే ఇంకే ఆప్షన్లు లేవు కాబట్టి జర హట్కె జర బచ్కే డీసెంట్ వాచ్ క్యాటగిరీలో పడిపోయింది. తొలి రెండు రోజులకు 13 కోట్ల దాకా వసూలు చేసి మొదటి వీకెండ్ ని ఇరవై కోట్లతో క్లోజ్ చేయొచ్చని ట్రేడ్ అంచనా. ఇవేవి భారీ ఫిగర్లు కాకపోయినా విక్కీ కౌశల్ రేంజ్ కి ఈ కంటెంట్ కి ఇది చాలా మంచి కలెక్షన్లే  

This post was last modified on June 4, 2023 4:20 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago