విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికి భోళా శంకర్ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఇవాళ మొదటి ఆడియో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ ఆల్బమ్ మీద ప్రత్యేక అంచనాలున్నాయి. కారణం స్వరబ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ తొలిసారి మెగాస్టార్ కు ట్యూన్స్ కంపోజ్ చేశాడు. తండ్రికి ఈ కాంబోలో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఉన్నాయి. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇద్దరు మిత్రులు, అంజి లాంటివి ఫెయిలైనా సాంగ్స్ మాత్రం సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ హైప్.
ఇక పాట విషయానికి ఇది భోళా శంకర్ టైటిల్ సాంగ్. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ప్రారంభంలోనే వస్తుంది. రామజోగయ్య శాస్త్రి క్యాచీ పదాలతో సమకూర్చిన సాహిత్యానికి రేవంత్ గాత్రం అందించారు. మొత్తం ఇంటీరియర్ లోనే షూట్ చేశారు. విజువల్స్ గట్రా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ట్యూన్ పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుంది. భోళా మేనియా అంటూ ఒక సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వినగా వినగా మెల్లగా కనెక్ట్ అయ్యేలా ఉంది. వాల్తేరు వీరయ్య విషయంలోనూ బాస్ పార్టీ మీద మొదట నెగటివిటీ వచ్చి ఆ తర్వాత ఆ పాటే టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే
దీనికే మహతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పలేం. డీసెంట్ మార్కులు వచ్చాయంతే. ఇంకా అసలు బాధ్యత చాలా ఉంది. అసలే వేదాళం రీమేక్ గా ఫ్యాన్స్ లో దీని మీద కొంత ప్రతికూలత ఉంది. దానికన్నా ఎక్కువ మెహర్ రమేష్ దర్శకత్వానికి టెన్షన్ పడుతున్నారు. వీటికి సమాధానం దొరకాలంటే దానికి మొదటి మెట్టు సంగీతమే అవ్వాలి. అసలే మహతికి ఛలో తర్వాత ఒక్క బెస్ట్ ఆల్బమ్ పడలేదు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే స్టార్ హీరోల నుంచి పిలుపులు వస్తాయి. తమన్, దేవిల తర్వాత మిగిలిపోయిన గ్యాప్ వాడుకుని త్వరగా ఎదగొచ్చు
This post was last modified on June 4, 2023 4:45 pm
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్‌లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…