తెలుగమ్మాయే అయిన షకీలా.. మలయాళ ఫిలిం ఇండస్ట్రీని ఒకప్పుడు ఎలా షేక్ చేసిందో 2000 సంవత్సరానికి అటు ఇటు యవ్వనంలో ఉన్న వాళ్లకు బాగానే తెలిసి ఉంటుంది. షకీలా నటించే సాఫ్ట్ పోర్న్ సినిమాల కారణంగా తమ చిత్రాల వసూళ్లు దెబ్బ తింటుండటంతో ఆమె సినిమాలపై నిషేధం విధించాలని మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని కోరే వరకు పరిస్థితి వెళ్లింది అప్పట్లో.
దర్శకుడు తేజ సైతం ఇటీవల ‘అహింస’ ఈవెంట్లో షకీలా నటించిన ఓ సినిమాకు హైదరాబాద్‌లో తారకరామ థియేటర్ ముందు నెలకొన్న హంగామా గురించి చెప్పారు. దీన్ని బట్టే అప్పట్లో షకీలా క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలానే స్వయంగా తనకు అప్పట్లో ఉన్న డిమాండ్ గురించి వివరించింది. తాను అప్పట్లోనే రోజుకు రూ.4 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
తాను అప్పట్లో భారీగా ఆస్తులు కూడా కొన్నానని.. కానీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే మోసపోయి ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నానని షకీలా తెలిపింది. తాను ఇప్పటికీ బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.
‘‘నేను అప్పట్లో రోజుకు రూ.4 లక్షలు పారితోషకం తీసుకునేదాన్ని. చాలా ఆస్తులు కూడా సంపాదించాను. కానీ ఐటీ వాళ్లు రైడ్ చేస్తారని భయపెట్టి.. నా ఆస్తులన్నీ నా సోదరి రాయించుకుంది. కానీ తర్వాత ఆమె నన్ను మోసం చేసి ఆ ఆస్తులన్నీ కాజేసింది. ఇప్పుడు నా దగ్గర ఏ ఆస్తులూ లేవు. నిజానికి సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె కొంపలో ఉంటున్నా’’ అని షకీలా తెలిపింది. తేజ ‘జయం’ సినిమాతో సాధారణ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన షకీలా.. తర్వాత ఇలాంటి చిన్నా చితకా పాత్రలే చాలా చేసింది. ఇప్పుడు ఆ ఛాన్సులూ లేక ఏవో టీవీ షోల్లో కనిపిస్తోంది.
This post was last modified on June 4, 2023 1:21 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…