పత్రికల్లో రకరకాల కుంభకోణాల గురించి తరచుగా వార్తలు చూస్తుంటాం. చాలామంది రచయితలు, దర్శకులు ఆ వార్తల నుంచే కథలు పుట్టిస్తుంటారు. ఐతే ఈ వార్తలు చూసి ఏదో ఐడియా తట్టి ఎగ్జైట్ అయిపోతే సరిపోదు. వాటి నుంచి ఆసక్తికర కథాకథనాలు తీర్చిదిద్దాలి. మనకు తెలిసిన విషయాల నుంచే భలే సినిమా తీశారే అని ప్రేక్షకులకు అనిపించేలా చేయాలి. కానీ మనం వార్తల్లో చూసే కుంభకోణాల ఆధారంగా సినిమాలు తీయడంలో మన వాళ్లు వీక్ అనే చెప్పాలి.
ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లు, అలాగే కోలీవుడ్, మాలీవుడ్ దర్శకులు మన వాళ్ల కంటే ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా వైట్ కాలర్ క్రైమ్స్ ఆధారంగా తమిళంలో ఎప్పుడూ మంచి మంచి సినిమాలే వస్తుంటాయి. తెలుగులోకి ‘అర్జున్ సురవరం’ పేరుతో రీమేక్ అయిన ‘కనిదన్’ సినిమాలో ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణాన్ని భలే చూపించారు. అలాగే ‘భద్రం’ పేరుతో అనువాదం అయిన ‘తెగిడి’ అనే సినిమాలో ఇన్సూరెన్స్ స్కామ్‌ను చూపించిన విధానం ఉత్కంఠభరితంగా ఉంటుంది.
అలాగే విశాల్ సినిమా ‘అభిమన్యుడు’లో సైబర్ క్రైమ్‌లు ఎలా ఉంటాయో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించారు. ‘శతురంగ వేట్టై’లో చైన్ బిజినెస్ పేరుతో జరిగే అక్రమాలు భలేగా ప్రెజెంట్ చేశారు. తెలుగులో ఇలా రియల్ లైఫ్ వైట్ కాలర్ క్రైమ్స్‌ను పకడ్బందీగా చూపించిన సినిమాలు తక్కువే. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో బ్యాంకుల్లో అన్ క్లైమ్డ్ అకౌంట్ల నేపథ్యంలో జరిగే నేరాల చుట్టూ కథను అల్లారు. ఐతే ఈ ఐడియా బాగుంది కానీ.. దాన్ని తెర మీద ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు.
ఈ పాయింట్ చుట్టూ మొత్తం కథను నడపకుండా ఐఫోన్ చుట్టూ ఫస్టాఫ్ అంతా వేస్ట్ చేశాడు. చివరి అరగంటలో అన్‌క్లైమ్డ్ అకౌంట్ల స్కామ్ చుట్టూ కథను నడిపించిన విధానం ఆకట్టుకున్నప్పటికీ.. అంతకుముందు చూపించిందంతా పరమ బోరింగ్‌గా ఉండటం వల్ల సినిమా తేడా కొట్టేసింది. మంచి ఐడియాను వేస్ట్ చేశారనే ఫీలింగ్ కలిగింది. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీసేటపుడు పైన చెప్పిన తమిళ చిత్రాలను ఒకసారి రెఫర్ చేస్తే బెటరేమో.
This post was last modified on June 3, 2023 11:17 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…