ఒక్కోసారి భక్తి సినిమాకు పని చేశామన్న భావన ఆయా నటీనటుల్లో సాంకేతిక నిపుణుల్లో అపారమైన దైవ చింతన తీసుకొస్తుంది. ఆదిపురుష్ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన అతుల్ ఏకంగా ముంబై నుంచి తిరుపతికి బైకు యాత్ర చేయబోతున్నాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం అక్షరాలా 1230 కిలోమీటర్లు. ఫ్లైట్ లో వెళ్తేనే కనీసం రెండు గంటల టైం పడుతుంది. అలాంటిది ప్రమాదాలు పొంచి ఉండే హైవే మీద కేవలం మూడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం చిన్న విషయం కాదు. మూడున బయలుదేరి అయిదుకి తిరుపతి చేరుకుని ఆరో తేదీ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతుల్ పాల్గొనబోతున్నాడు.
అజయ్ తో కలిసి జై శ్రీరామ్ పాట లైవ్ పెర్ఫార్మన్స్ ని లక్షలాది ప్రేక్షకుల ముందు ఇవ్వబోతున్నారు. ఇది తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కష్టపడి పనిచేసినా మరీ ఇంత రిస్క్ తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో వంద కిలోమీటర్లంటే ఓకే కానీ మరీ సహస్రం అంటే మాములు సాహసం కాదు. ఏడుకొండల వాడి పాదాల దగ్గర ఆదిపురుష్ ఈవెంట్ తాలూకు పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. పాస్ లు సిద్ధం చేసి జిల్లాల వారి అభిమాన సంఘాలకు పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక అభిమాన బృందం బయలుదేరబోతోంది
ఇంకో పదమూడు రోజుల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆదిపురుష్ కు సంబంధించిన ఏ వార్తయినా సరే హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ట్రైలర్, రెండు పాటలకు దక్కిన రెస్పాన్స్ చూసి టి సిరీస్ సంస్థ హుషారుగా ఉంది. ఈవెంట్ రోజున రెండున్నర నిమిషాల మరో స్పెషల్ ట్రైలర్ ని వదలబోతున్నారు. ఇందులో కేవలం యుద్ధాలు, యాక్షన్ సన్నివేశాలతో కూడిన విజువల్స్ ఉంటాయట. ఇది చూశాక హైప్ ని పట్టుకోవడం కష్టమేనని ఇన్ సైడ్ టాక్. ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే వారం నుంచే ఆన్ లైన్ సేల్స్ మొదలవుతాయి
This post was last modified on June 3, 2023 7:52 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…