లెజెండరీ స్టార్ హీరోల చివరి సినిమాలు చిరస్మరణీయం కావాలని కోరుకుంటారు కానీ ఒక్కోసారి అనూహ్యంగా ఇవి కొత్త మలుపులు తీసుకుంటాయి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం మనం. అయితే నలభై ఏళ్ళు ల్యాబ్ లో మగ్గిపోయిన ప్రతిబింబాలు లాస్ట్ మూవీ అయ్యింది. థియేట్రికల్ రిలీజ్ నే కౌంట్ గా తీసుకుంటారు కనక అలా మనం ఆ ల్యాండ్ మార్క్ ని మిస్ అయ్యింది. స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ హిందీ వెర్షన్ ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. శోభన్ బాబు, కృష్ణంరాజుగార్ల ఫిల్మోగ్రఫీ డిజాస్టర్లతోనే ముగిసింది.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. ఆయన ఆఖరిగా తెరమీద కనిపించిన సినిమా శ్రీశ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాన్స్ కి గుర్తే. నరేష్, విజయనిర్మల కీలక పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడిది లాస్ట్ కాదు. ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చివరిది కానుందని దాని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇది ఎప్పుడో 2007లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రకరకాల కారణాల వల్ల ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. శాండల్ వుడ్ లో పేరున్న హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించారు. ఇన్నేళ్లు బయటికి తీసుకొచ్చే చొరవ ఎవరూ చేయలేదు.
కృష్ణగారు వెళ్ళిపోయాక ఇప్పుడు దీనికి మోక్షం తీసుకురానున్నారు. పోస్టర్ గట్రా చూస్తుంటే బాగా తక్కువ బడ్జెట్ లో తీసినట్టు కనిపిస్తోంది. బిజినెస్ జరగని కారణంగా ఆపేశారో లేక నిర్మాత చేతులు ఎత్తేశారో ఏదైతేనేం ఇలాంటివి చివరి జ్ఞాపకాలుగా ఉండటం ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరు. నిజంగా కంటెంట్ అంత బాగుంటే ఎప్పుడో వచ్చేదిగా. పదిహేడేళ్లు వేచి చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. నాలుగు వందల సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోలేకపోయిన కృష్ణ ఎవరూ అందుకోలేని మైలురాళ్లు టాలీవుడ్ లో పాతేసి వెళ్లారనేది నిజం.
This post was last modified on June 3, 2023 1:38 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…