ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, డివిడిలకు పరిమితమైన పైరసీ ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకుని డిజిటల్ కు షిఫ్ట్ అయిపోయింది. మరింత చవకగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా జనాలకు అందుబాటులో ఉంటోంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే వేల కోట్లతో సినిమాలు తీసే హాలీవుడ్ నిర్మాతలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం చట్టానికి సైతం సవాల్ గా నిలిచి పోలీసులు ఒకదశ దాటి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ బెడద ఓటిటిలకూ అంటుకుని ముచ్చెమటలు పట్టిస్తోంది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో అసుర్ ఒకటి. మున్నాభాయ్ లో ఏటీఎంగా నటించిన అర్షద్ వార్సీ ప్రధాన పాత్ర పోషించారు. పురాణాల్లోని కర్మ సిద్ధాంతానికి హింసను ముడిపెట్టి తీసిన వెరైటీ సైకో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ కి బ్రహాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రెండో భాగాన్ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేశారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తామని ఆ మేరకు ఒక్కొకటి వదలడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్న జియో టీమ్ వెంటనే అన్నీ రిలీజ్ చేసింది
అసలు అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాక జియో బృందం తలలు పట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం కొందరు రివ్యూయర్లకు ప్రత్యేకంగా అసుర్ 2 మొత్తాన్ని ఆన్ లైన్ లో స్క్రీన్ చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ బయటికి వచ్చిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లలో డేటా లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వచ్చాయంటే పైరసీ టీమ్ సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత అడ్వాన్స్ అవుతున్న వాళ్ళను కట్టడి చేయడం భవిష్యత్తులో అయినా దుర్లభమే అనిపిస్తుంది
This post was last modified on June 3, 2023 10:03 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…