సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పేరు అవకాశాలు తీసుకురాకపోయినా కీర్తి సురేష్ కు ఆ లోటుని దసరా పూర్తిగా తీర్చేసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న వెన్నెల క్యారెక్టర్ దక్కడంతో మహానటి తర్వాత మరోసారి తన బెస్ట్ ఇచ్చేసింది. అయితే శ్రీలీల జోరులో తనకు ఆఫర్లు తగ్గాయని అభిమానులు ఫీలవుతున్నారు కానీ నిజానికి కీర్తి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలతో ఈ ఏడాది సందడి చేయబోతోంది. అందులో మొదటిది చిరంజీవి భోళా శంకర్. చెల్లెలి పాత్రే అయినా మెగాస్టార్ కాంబినేషన్ కాబట్టి మంచి మెమరీ అవుతుంది.
ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామన్నన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకుడు. తెలుగు డబ్బింగ్ డీల్ పూర్తి కాకపోవడంతో టైటిల్ గట్రా వ్యవహారాలు ఇంకా మొదలుకాలేదు. వడివేలు ఇందులో సీరియస్ పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. జయం రవితో చేస్తున్న సైరన్ మీదా భారీ అంచనాలున్నాయి. టైటిల్ రోల్ పోషిస్తున్న రివాల్వర్ రీటా ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతోంది. కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ రఘు తాత సైతం డిఫరెంట్ సబ్జెక్టే. ఇవన్నీ 2023లోనే వచ్చేస్తాయి.
ఆకాశం నీ హద్దురా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుధా కొంగర తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్. సూర్యతో ఉంటుందా లేక మరొకరు చేస్తారానేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఇలా మొత్తం అరడజను సినిమాలతో అమ్మడు మాములు బిజీగా లేదు. కాకపోతే రెగ్యులర్ గ్లామర్ పాత్రలు ఎక్కువ చేయను అంటోంది. ఈ మధ్య ఫోటో షూట్స్ లో కాస్త మొహమాటం పక్కనపెడుతున్న కీర్తికి మళ్ళీ మహానటి రేంజ్ బ్రేక్ ఏ చిత్రం ఇస్తుందో చూడాలి. పైన చెప్పినవాటిలో కనీసం సగం హిట్టయినా కోలీవుడ్ నెంబర్ వన్ చైర్ ని అందుకోవచ్చు.
This post was last modified on %s = human-readable time difference 11:31 am
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…