కొన్ని బ్లాక్ బస్టర్స్ తాలూకు హ్యాంగోవర్ ప్రేక్షకుల మీదే కాదు దర్శకుల మీద కూడా ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్ యశస్వి రూపొందించిన సిద్దార్థ్ రాయ్ టీజర్ చూస్తే అదే అనిపిస్తోంది. అతడు-పెదబాబు లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరో అయ్యాడు. తన్వి నేగి హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ లవ్ యాక్షన్ డ్రామాలో అర్జున్ రెడ్డి షేడ్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు వరల్డ్ ఫేమస్ లవర్ తాలూకు ఇన్స్ పిరేషన్ కూడా తెలిసిపోతోంది. కథేంటో ఎలా ఉండబోతోందో వీడియోలో బాగానే క్లూస్ ఇచ్చేశారు.
సిద్దార్థ్ రాయ్(దీపక్ సరోజ్) కు ప్రతిదీ లాజిక్ గా చూడటం మాట్లాడటం అలవాటు. గొప్ప మేధావి. అలా ఆలోచించడం ఎక్కువైపోయి ఎమోషన్స్ లేకుండా మారిపోతాడు. ఏదైనా సరే మెకానికల్ గా ఆస్వాదిస్తాడు. ఆఖరికి సెక్స్ కావాలన్నా పక్కన ఎవరుంటే వాళ్లను బెడ్ రూమ్ కు తీసుకెళ్ళిపోతాడు. ఇంట్లో పని మనిషి అయినా సరే డోంట్ కేర్. అలాంటి వాడి జీవితంలో ఓ అమ్మాయి(తన్వి నేగి) వస్తుంది. ఇతగాడి వింత ప్రవర్తనను అందరూ ఏవగించుకుంటున్నా ప్రేమిస్తుంది. బ్రేకప్ వస్తుంది. సిద్దార్థ్ కి నిజమైన ప్రేమంటే ఏమిటో అర్థమవుతుంది. తర్వాత జరిగేది తెరమీద చూడాలి.
హీరో క్యారెక్టరైజేషన్ మరీ తీవ్రంగా ఉంది. ఎంత అగ్రెసివ్ గా ఉంటే యూత్ కి అంత కనెక్ట్ అవుతారనే భావనో లేక విపరీత పోకడని ట్రెండ్ పేరుతో చూపించే ప్రయత్నమో ఏదైతేనేం యూత్ ని లక్ష్యంగా పెట్టుకున్న సిద్దార్థ్ రాయ్ క్రమంగా అర్జున్ రెడ్డి పోలికల నుంచి తప్పించుకోవడం కష్టమే. దీపక్ సరోజ్, తన్విల పెర్ఫార్మన్స్ బాగానే కనిపిస్తోంది. సంగీతం సమకూర్చింది రధన్ కావడం మరో కొసమెరుపు. బిజిఎంలో ఆ మార్కు కనిపించేసింది. శ్యామ్ కె నాయుడు, ప్రవీణ్ పూడి లాంటి టెక్నీషియన్స్ పని చేసిన సిద్దార్థ్ రాయ్ ని యువత రిసీవ్ చేసుకుంటే హిట్టే
This post was last modified on June 1, 2023 7:28 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…