రేపు బాక్సాఫీస్ వద్ద చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. దేనికీ భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేకపోయినా అన్నీ ప్యూర్ కంటెంట్ ని నమ్ముకుని దిగుతున్నాయి. బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన నేను స్టూడెంట్ సర్ మీద కామన్ ఆడియన్స్ లో బజ్ లేకపోయినా పబ్లిక్ టాక్ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుందన్న నమ్మకం హీరోతో పాటు టీమ్ మొత్తంలో కనిపిస్తోంది. అయితే మొదటి రోజే థియేటర్ కు రప్పించే హుక్ పాయింట్ ప్రస్తుతానికి ఇందులో కనిపించడం లేదు. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తున్నా స్క్రీన్ మీద ఏదో మేజిక్ జరగాల్సిందే.
దగ్గబాటి వారసుడు అభిరాం అహింస రేపే రానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ డ్రామలో ఏదో కొత్త విషయం, అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉంటే తప్ప జనాన్ని రప్పించడం కష్టం. ఆర్పి పట్నాయక్ సంగీతం ఆశించిన స్థాయిలో ఛార్ట్ బస్టర్ అవ్వలేదు. మాసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన పరేషాన్ మీద యూత్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. అనూహ్యంగా దీనికి సమర్పకుడు రానా కావడం విశేషం. తమ్ముడి లాంచ్ అదే రోజు ఉందని తెలిసినా కూడా ఒక వారం ఆలస్యంగానో ముందుగానో రాకుండా క్లాష్ కి సిద్ధపడటం విచిత్రమే
చక్రవ్యూహం, ఐక్యూ, అభిలాష, బంగారు తెలంగాణ అనే మరో నాలుగు చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఒక రోజు ముందే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ రావడం మల్టీప్లెక్స్ కలెక్షన్లను ఆల్రెడీ లాగేస్తోంది. హిందీ నుంచి విక్కీ కౌశల్ జర హట్కె జర్ బచ్కె ఒకటే కాస్త నోటెడ్ రిలీజ్. స్టార్ అట్రాక్షన్ లేకుండా ఇంత టాలీవుడ్ క్లాష్ జరగడం కొత్తేమి కాకపోయినా కనీసం సగం హాళ్లు నిండేంత కూడా జనం రాకపోతే ఎన్ని విడుదలైనా తమకు ఆనందమేమి ఉందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. మరి వీటిలో ఏవి మెప్పించబోతున్నాయో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది
This post was last modified on June 1, 2023 11:24 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…