పుట్టి పెరిగింది చెన్నైలో, సినిమాల్లో అరంగేట్రం చేసింది కోలీవుడ్లో అయినా.. తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టి ఇక్కడ పెద్ద హీరోయిన్ అయిపోయింది సమంత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన ఆమె సిటాడెల్ సిరీస్‌తో మరింత పాపులారిటీ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. అది వచ్చే లోపే ఆమె హాలీవుడ్లోకి కూడా అరంగేట్రం చేయబోతుండటం విశేషం.
సామ్ తొలి హాలీవుడ్ సినిమా ఖరారైనట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘చెన్నై స్టోరీ’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. విల్ మచిన్ నిర్మాత. ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలు కూడా బయటికి వచ్చేశాయి.
లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్ యువకుడు తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. నిఖిల్ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్ కల్రా నటించనున్నాడట.
ఈ సినిమా షూటింగ్ చెన్నై, బ్రిటన్‌లో ఉంటుందట. సమంత నటిస్తున్న తొలి ఇంగ్లిష్ చిత్రమిది. ముందు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి చూస్తున్నారట. ప్రస్తుతం సమంత తెలుగులో ‘ఖుషి’ చిత్రం చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం సమంత, విజయ్ దేవరకొండ టర్కీకి వెళ్లారు.
This post was last modified on June 1, 2023 12:28 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…