కొన్ని ముచ్చట్లు చిన్నవిగా అనిపించినా అభిమానులకు మాత్రం భలే కిక్ ఇస్తాయి. ఎల్లుండి విడుదల కాబోతున్న నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో బెల్లంకొండ గణేష్ ఓ ఆసక్తికరమైన ముచ్చట చెప్పాడు. అదేంటంటే ఇతను బాలకృష్ణ అబ్బాయి మోక్షజ్ఞ ఇద్దరూ మంచి స్నేహితులు. రచ్చ రిలీజైనప్పుడు కలిసి థియేటర్ కు వెళ్లారు. ప్రేక్షకుల గుంపులో ఎవరో గుర్తుపట్టేశారు. అరే రామ్ చరణ్ సినిమాకు బాలయ్య వారసుడు వచ్చాడని వెనుక నుంచి ఎవరో అరిచారట. దీంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పుకొచ్చాడు.
ఫాన్స్ మధ్య ఏమో కానీ నిజానికి హీరోలు వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఈగో పట్టింపులు ఉండవు. చరణ్ మూవీ అయినా భవిష్యత్తులో ఎలాగూ తాను పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి ఓసారి చూడమని మోక్షజ్ఞ వెళ్లి ఉండొచ్చు. లేదా నిజంగా అతనంటే ఇష్టం అయ్యుండొచ్చు. కారణం ఏదైనా మెగా పవర్ స్టార్ అభిమానులు మాత్రం చరణ్ మావాడే అంటూ ట్విట్టర్ లో ఆ వీడియోతో హంగామా చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ బాలయ్యల మధ్య అప్పట్లో మంచి స్నేహం ఉండేది. అదే ఫ్రెండ్ షిప్ గణేష్ మోక్షజ్ఞల మధ్య కూడా ఉండేదన్న క్లారిటీ వచ్చింది.
నేను స్టూడెంట్ సర్ మీద అంచనాలు పెద్దగా లేకపోయినా గణేష్ మాత్రం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మొదటి మూవీ స్వాతిముత్యం హిట్ కాలేదంటే ఒప్పుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా తనతో సెల్ఫీలు దిగుతున్నారని దీనికన్నా సక్సెస్ ఏం కావాలని చెప్పాడు. లాజిక్ కొంచెం అమాయకంగా ఉన్నా కంటెంట్ పరంగా డెబ్యూ మీద ఎలాంటి కంప్లయింట్ రాలేదు. నేను స్టూడెంట్ సర్ లో మంచి ట్విస్టులు ఉంటాయని క్లైమాక్స్ మైండ్ బ్లాంక్ చేస్తుందని నిర్మాత చాలా ధీమాగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే డీసెంట్ టాక్ వస్తే చాలు హిట్ పడటం ఖాయంగా ఉంది
This post was last modified on May 31, 2023 9:31 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…