మెగా ఫ్యామిలీలో అనుకున్నంతగా సక్సెస్ కానీ హీరోల్లో అల్లు శిరీష్ ఒకడు. ఉన్నంతలో అల్లు అరవింద్ అండ్ కో తన కోసం మంచి ప్రాజెక్టులే సెట్ చేస్తున్నా.. అతను కోరుకున్న సక్సెస్ మాత్రం రావట్లేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే శిరీష్ కెరీర్లో పెద్ద హిట్ లేదు. తన చివరి సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టలేక యావరేజ్ మూవీగా నిలిచింది.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న శిరీష్, ఇప్పుడు ‘బడ్డీ’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం వెల్లడైంది. ఈ సినిమా ప్రి లుక్ చూడగానే ఇది తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్ అన్న నిర్ణయానికి వచ్చేశారు జనాలు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఇది రీమేక్ కాదని శిరీష్ స్పష్టం చేశాడు. కానీ అతను ఆ మాట అన్నా కూడా జనాలకు ఇది రీమేక్ కాదన్న నమ్మకం కలగట్లేదు.
‘టెడ్డీ’ సినిమాలో మాదిరే ఇందులోనూ ఒక టెడ్డీ బేర్‌ది ముఖ్య పాత్ర అనే విషయం పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. పైగా ఈ పోస్టర్ కూడా.. ‘టెడ్డీ’ ప్రోమోలకు చాలా దగ్గరగా ఉంది. అన్నింటికీ మించి ‘టెడ్డీ’ సినిమాను నిర్మించిన తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ పేరు ‘బడ్డీ’ పోస్టర్ మీదా ఉంది. అలాంటపుడు ఇది రీమేక్ కాదని ఎలా అనుకుంటాం? గీతా ఆర్ట్స్ వాళ్లు రీమేక్‌ల విషయంలో కొంచెం తెలివిగానే అడుగులు వేస్తుంటారు.
‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాను స్ట్రెయిట్ మూవీలాగే ప్రమోట్ చేశారు. ఎక్కడా రీమేక్ అన్న ప్రస్తావనే రాలేదు. మాతృకతో పోలిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల రైటింగ్ క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్‌కు ఇవ్వలేదు. ఇప్పుడు ‘టెడ్డీ’ విషయంలో అదే శైలిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. రీమేక్ అంటే జనాల్లో ఆసక్తి తగ్గిపోతోంది కాబట్టే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సామ్ ఆంటోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
This post was last modified on May 31, 2023 6:24 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…