ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా హర్ట్ చేసిన వెబ్ సిరీస్ అంటే.. రానా నాయుడు అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా పేరుపడ్డ విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా.. వారి కోసం సిరీస్ చూసిన వాళ్లకు దిమ్మదిరిగింది. వెబ్ సిరీస్‌లు అంటే కొంచెం బోల్డ్‌గా ఉండటం మామూలే కానీ.. ఇందులో బోల్డ్‌నెస్ శ్రుతి మించి వల్గర్‌గా తయారవడంతో మన వాళ్లు తట్టుకోలేకపోయారు.
ముఖ్యంగా వెంకీతో మాట్లాడించిన బూతులు.. ఇందులో కొన్ని సీన్లు చూసి ఆయన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఓవరాల్‌గా ఈ సిరీస్ కూడా అనుకున్నంత ఆసక్తికరంగా లేకపోవడంంతో బాగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వెంకీ ఎలా ఈ సిరీస్ చేశాడనే ప్రశ్నలు తలెత్తాయి అభిమానుల నుంచి. ఈ ఫీడ్ బ్యాక్ అంతా వెంకీకి చేరినట్లే కనిపిస్తోంది.
రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న అహింస సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో పాల్గొన్న వెంకీకి రానా నాయుడు ఫీడ్ బ్యాక్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో రెండో సీజన్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తొలి సీజన్ చూసిన ప్రేక్షకుల స్పందనను తాను తెలుసుకున్నట్లు వెంకీ తెలిపాడు.
దాన్ని అనుసరించి వాళ్లకు నచ్చేలా, ఎక్కువమందికి రీచ్ అయ్యేలా రెండో సీజన్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు వెంకీ చెప్పాడు. ఐతే అన్నీ అందరికీ నచ్చాలని లేదని.. అందరినీ మెప్పించలేమని వెంకీ అన్నాడు. రానా నాయుడు ఒక హాలీవుడ్ సిరీస్ ఆధారంగా రూపొందిన విషయాన్ని గుర్తు చేస్తూ ఒరిజినల్ కంటెంట్‌ను మన వాళ్లకు నచ్చేలా రెండో సీజన్‌ను తీర్చిదిద్దుతున్నట్లు వెంకీ సంకేతాలు ఇచ్చాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే రెండో సీజన్‌లో వల్గారిటీ తగ్గొచ్చు.. అదే సమయంలో ఇది కూడా కొంచెం బోల్డ్‌గానే ఉంటుందని అర్థమవుతోంది.
This post was last modified on May 31, 2023 1:14 pm
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…