సినిమా హీరో అంటే సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్లటం పాత కాన్సెప్టు. గతానికి భిన్నంగా హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం సినిమాలు చేస్తూనే.. తమకు తగ్గ వ్యాపారాల్ని చేయటం చూస్తున్నాం. అయితే.. ఇలా చేసే వారి వ్యాపారాలు ఒక రేంజ్ లో ఉంటున్నాయి. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు గచ్చిబౌలిలో AMB మాల్ రన్ చేస్తుంటే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో AVD పేరుతో మల్టిప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అదే బాట పట్టారు.
అమీర్ పేట లో కొత్తగా మల్టీఫ్లెక్స్ నిర్మించటం తెలిసిందే. గతంలో ఇక్కడే సత్యం థియేటర్ ఉండేది. దాన్ని తీసేసి.. కొత్తగా భారీ ఎత్తున మల్టీఫ్లెక్స్ నిర్మించారు. దీనికి ‘AAA సినిమాస్’ పేరును డిసైడ్ చేశారు. దీనికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేశారు. AAA అంటే.. ఏషియన్ అల్లుఅర్జున్ గా చెబుతున్నారు. ఈ మల్టీఫ్లెక్సులో మొదటి సినిమాను డిసైడ్ చేశారు. జూన్ 16న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తో ఈ మల్టీఫ్లెక్సును ఓపెన్ చేస్తారని చెబుతున్నారు.
దీన్ని డార్లింగ్ స్టార్ ప్రభాస్ తో ఓపెన్ చేయిస్తారని చెబుతున్నారు. ఆదిపురుష్ మూవీ విడుదలకు మరో రెండు వారాలు టైం ఉన్న నేపథ్యంలో.. అక్కడ పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజా మల్టీఫ్లెక్సు బన్నీది కావటంతో.. వారి ఫ్యాన్స్ లో ఈ మల్టీఫ్లెక్సు మీద ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ మల్టీఫ్లెక్సు ఓపెనింగ్ ను వినూత్నంగా నిర్వహించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on May 31, 2023 11:03 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…