నిర్మాత కొడుకులే కాదు , లక్షణాలుంటే ఆ కుటుంబంలో ఎవరైనా హీరో అవ్వొచ్చని తాజాగా దిల్ రాజు కుటుంబం నుండి హీరోగా వచ్చిన ఆశిష్ నిరూపించాడు. ఇప్పుడు మరో నిర్మాత కుటుంబం నుండి కొత్త హీరో రాబోతున్నాడు. ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబం నుండి ఆయన బావ మరిది సాయి హీరోగా పరిచయం అవుతున్నాడు.
రెండేళ్ళుగా సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఫైనల్ గా ఆ బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించాడు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల సాయిను హీరోగా పరిచయం చేస్తూ ఓ న్యూ ఏజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన అడ్డాల నటుడు , నిర్మాత నాగబాబు కొడుకు వరుణ్ తేజను ‘ముకుందా’ తో హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మహేష్ , వెంకటేశ వంటి స్టార్స్ ను డైరెక్ట్ చేశాడు. ‘నారప్ప’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఈ యూత్ సినిమాతో రాబోతున్నాడు. మరి మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టిన బాధ్యత ను శ్రీకాంత్ అడ్డాల ఎలా నిర్వర్తిస్తాడో ? డెబ్యూ హీరో సాయికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం పైనే పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ 2 న రిలీజ్ చేయనున్నారు.
This post was last modified on May 30, 2023 7:40 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…