లాక్ డౌన్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. షూటింగులూ ఆగిపోయాయి. ముందు సినీ జనాలంతా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుందామా అని చూస్తున్నారు.
రచయితలు, దర్శకులు కథల మీద కూర్చుంటే.. హీరోలు కథలు వినే, స్క్రిప్టులు చదివే పనిలో పడ్డారు. నిర్మాతలు ప్రొడక్షన్ పనులు పకడ్బందీగా చేసుకుంటున్నారు. దీని వల్ల పోస్ట్ కరోనా రోజుల్లో ఒక పర్ఫెక్షన్ వస్తుందని.. సినిమాల నాణ్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
మామూలుగా అయితే సినీ రంగంలో పనులన్నీ చాలా హడావుడిగా నడుస్తుంటాయి. రచయితలు, దర్శకులు సినిమాలకు, సినిమాలకు మధ్య పెద్దగా విరామం తీసుకోరు. నిర్మాతలు కూడా అంతా. స్క్రిప్టు, ప్లానింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ముందుకెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో కూడా ఔట్ పుట్ దెబ్బ తినేస్తుంటుంది. కానీ ఇప్పుడు సినీ జనాలకు ఎన్నడూ లేనంత ఖాళీ దొరికింది. ఈ సమయంలో పర్ఫెక్షన్ కోసం అందరూ ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు.
కొత్త కథలు రెడీ చేస్తున్నవాళ్లు డెడ్ లైన్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పని చేస్తారు. ఆల్రెడీ సిద్ధం చేసిన కథల్ని మరింత పక్కాగా తీర్చిదిద్దుకుంటారు. ఈ ప్రశాంత, ఆహ్లాద వాతావరణంలో ఆలోచనలు కూడా కచ్చితంగా మెరుగవుతాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం మంచి కథలు రెడీ అవుతాయి. అలాగే మేకింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాల విషయానికి వస్తే.. రషెస్ చూసుకుని లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మిగతా షూటింగ్ విషయంలో ప్రణాళిక పక్కాగా ఉంటుంది. స్క్రిప్టులో మరిన్ని మంచి మార్పులు జరగొచ్చు.
హీరోలు కూడా ఇంతకుముందులా హడావుడి పడకుండా బోలెడన్ని కథలు విని.. వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంచుకునే అవకాశముంది. ఇంతకుముందు అవకాశం రాని వాళ్లు కథలు వినిపిస్తుండొచ్చు. పక్కన పడేసిన మంచి స్క్రిప్టుల్ని బయటికి తీసి చదవొచ్చు. ఇలా లాక్ డౌన్ తర్వాత సినిమాలు మెరుగ్గా తయారవడానికి మంచి అవకాశాలే ఉంటాయని.. వచ్చే ఏడాది సినిమాల క్వాలిటీ పెరిగి సక్సెస్ రేట్ కూడా పెరగొచ్చని ఆశించవచ్చు.
This post was last modified on April 24, 2020 4:28 am
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…