అల్లు శిరీష్ తన నెక్స్ట్ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన కో స్టార్ అంటూ టెడ్డీ బొమ్మను చూపిస్తూ వెనుక స్టిల్ రిలీజ్ చేశాడు. రేపు ఫస్ట్ లుక్ తో మిగతా వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపాడు. దీంతో అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కుతుందని, అందులో టెడ్డీ బొమ్మ కీలక పాత్ర పోషించనుందని క్లియర్ గా తెలుస్తుంది. అయితే శిరీష్ చేస్తున్న ఈ సినిమా దేనికైనా రీమేకా ? లేదా డైరెక్ట్ మూవీ ఆ ? అంటూ సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ నడుస్తుంది.
ఈ తరహా టెడ్డీ బొమ్మతో తెలుగులో సినిమా రాలేదు. తమిళ్ లో ఆర్య ‘టెడ్డీ’ పేరుతో ఓ సినిమా చేశాడు అది అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేదు. ఇక సందీప్ కిషన్ కూడా బడ్డీ అనే టైటిల్ తో ఈ తరహా కథతో సినిమా మొదలు పెట్టాడు. కానీ అది షూటింగ్ పూర్తయిందా లేదా కూడా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శిరీష్ ఇలా టెడ్డీ తో సినిమా అంటూ ఎనౌన్స్ చేసే సరికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇది ఆర్య చేసిన తమిళ సినిమాకు రీమేక్ ఆ ? అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి.
శిరీష్ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. హిట్ , ఫ్లాప్ పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సరకొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇది ఏదైనా సినిమాకు రీమేకా ? లేదా ఏదైనా హాలీవుడ్ సినిమా ఇన్స్ పిరేషన్ తో తెరకెక్కుతుందా ? అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on May 30, 2023 12:01 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…