జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20న తన పుట్టిన రోజు నాడే జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ వేడుకల కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా వెళ్లి తారక్‌కు ఇన్విటేషన్ ఇవ్వగా.. చాలామంది కలిసి ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను ఈ సమయంలో వాయిదా వేసుకోలేనని చెప్పి తారక్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.
ఐతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కంటే ఫ్యామిలీ ట్రిప్ ముఖ్యం అయిపోయిందా అంటూ తారక్‌ను చాలామంది విమర్శించారు. కానీ తారక్ కోణంలో చూస్తే ఇదేమీ తప్పు అనిపించదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 20వ తారీఖునే పెడతారని.. అందుకు తనను ఆహ్వానిస్తారని అతను అనుకుని ఉండడు కదా? పైగా 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక దాన్ని క్యాన్సిల్ చేయడం లేదా వాయిదా వేయడం అంటే చాలామంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాలేదు కాబట్టి.. తాత మీద తారక్‌కు ప్రేమాభిమానాలు లేవని అనుకోవడం కరెక్ట్ కాదు అతడి అభిమానుల వాదన. సీనియర్ మీద జూనియర్ అభిమానం ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లిన తారక్.. 28న తన తాత శత జయంతి కోసమనే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాడు. ఇంటి దగ్గర వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సాయంత్రానికల్లా మళ్లీ ఫ్యామిలీని తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్లాడా లేదా.. ఇది వేరే ట్రిప్పా అన్నది తెలియదు కానీ.. అతను మద్యలో హైదరాబాద్‌కు వచ్చింది మాత్రం తాతకు నివాళి అర్పించడానికే అన్నది స్పష్టం. ఇక తాత పట్ల గౌరవాభిమానాల విషయంలో తారక్‌ను ఎవ్వరూ శంకించడానికి వీల్లేదంటూ అతడి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on May 29, 2023 1:31 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…