కాదేది క్రియేటివిటీకి అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కాస్త బుర్రపెట్టి ఆలోచించాలే కానీ వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పడానికి మన దగ్గరే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అతి శుభ్రత వ్యాధి మీద శర్వానంద్ తో మారుతీ మహానుభావుడు తీస్తే మంచి సక్సెస్ అందుకుంది. మతిమరుపుతో భలే భలే మగాడివోయ్ లో నాని సృష్టించిన హాస్యం కాసులు కురిపించింది. తమిళంలో రెండు వారాల క్రితం విడుదలైన గుడ్ నైట్ వీటిని మించిన వినూత్నమైన పాయింట్ తో తక్కువ బడ్జెట్ లో రూపొంది పెద్ద హిట్టు కొట్టింది.
ఇందులో కథేంటో చూద్దాం. మోహన్(మణికందన్)కు గురక సమస్య. అక్కా బావలతో కలిసి ఉంటాడు. తన జబ్బు వల్ల ఇబ్బందులు అవమానాలు ఎదురవుతున్నా ఏదోలా నెట్టుకొస్తాడు. అను(మీరా రఘునాధ్)పరిచయమయ్యాక మోహన్ కు ప్రేమ పుడుతుంది. ఇద్దరి స్నేహం పెళ్లి దాకా వెళ్తుంది. అయితే గురక విషయం మాత్రం ఆమె దగ్గర దాచి పెడతాడు. కొత్త కోడలిగా ఇంటికి వచ్చాక అనుకి అసలు రహస్యం తెలుస్తుంది. ఆపై ఏం జరిగింది, భార్యాభర్తలు సర్దుకున్నారా లేదానే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. చాలా సింపుల్ లైన్ తో గుడ్ నైట్ తెరకెక్కింది
దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో పాటు సున్నితమైన హాస్యాన్ని జోడించడంతో ఎక్కడా విసుగు రాకుండా గుడ్ నైట్ సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన తీరు మెచ్చుకోకుండా ఉండనివ్వదు. దానికి తోడు హీరో హీరోయిన్లతో పాటు ఇతర ఆర్టిస్టులు రమేష్ తిలక్, బాలాజీ శక్తివేల్, రైచెల్ రెబెక్కా, భగవతి పెరుమాళ్ తో పాటు ఇతర తారాగణం సహజమైన నటనతో ఆకట్టుకోవడంతో సగటు మధ్య తరగతి ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది తెలుగులో రీమేక్ చేస్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ వీలైనంత త్వరగా డబ్బింగ్ చేస్తే ఆదరించే ఆడియన్స్ మనకెలాగూ ఉన్నారు
This post was last modified on May 29, 2023 12:26 am
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…