ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు చాలా క్యాలికులేటెడ్ గా ఉండాలి. ఏ మాత్రం స్లిప్ అయినా సరే ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా రివర్స్ అయిపోతాయి. నిన్న జరిగిన దగ్గుబాటి అభిరాం డెబ్యూ మూవీ అహింస వేడుకలో దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ యూనిట్ తో పాటు సగటు అభిమానుల్లో కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి. నిర్మాత సురేష్ బాబు తొంభై శాతం షూటింగ్ పూర్తయ్యాక బాగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని కానీ తాను రామానాయుడుగారికి ఇచ్చిన మాట కోసం పూర్తి చేస్తానని అన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
నిజానికి ఇందులో అహింస ఎలా ఉండబోతోందో క్లూ ఇచ్చినట్టే ఉంది. నాయుడుగారి కోరిక మేరకు అభిరాంని పరిచయం చేసే బాధ్యత తీసుకోవడం వరకు ఓకే. అదేదో జయం, చిత్రం, నువ్వు నేను లాగా హిట్టయ్యే కంటెంట్ తీసుకోవచ్చుగా. తాతయ్యగా ఆయన కోరుకున్నది మనవడు సక్సెస్ అవ్వాలని కానీ ఊరికే ఓసారి తెరమీద కనపడితే చాలని కాదుగా. అలాంటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ తీశారని ఫ్యాన్స్ కి చెబితే బాగుంటుంది కానీ ఇలా పబ్లిక్ గా సురేష్ వద్దన్నారు బాలేదని ఓపెన్ గా అనేయడం ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుందనడంలో డౌట్ అక్కర్లేదు
అసలే అహింస మీద ఏ మాత్రం బజ్ లేదు. నిన్న ఈవెంట్ ని మినహాయిస్తే పబ్లిసిటీ మొదలుపెట్టిందే నాలుగైదు రోజుల నుంచి. తేజ అభిరాం హీరోయిన్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు లైవ్ లోకి రాలేదు. టైం తక్కువగా ఉంది. వస్తారో లేదో కూడా తెలియదు. ఇన్ని ప్రతికూలతల మధ్య అహింస అటుపక్క బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ఇవన్నీ చూసుకోకుండా తేజ మనసులో ఉన్నది చెప్పేశారు కానీ ఇప్పుడీ స్పీచ్ పట్లే సురేష్ బాబు, రానా ఇద్దరూ కాస్త గుస్సాగా ఉన్నారట
This post was last modified on May 28, 2023 7:20 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…