పాన్ ఇండియా స్టార్లు అయిపోవాలని చాలామందికి ఉంటుంది. కానీ మన ఇండస్ట్రీలో ఎంతో కాలంగా పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయికి వెళ్లలేకపోయారు. కానీ నిఖిల్ అనే చిన్న స్థాయి యంగ్ హీరో.. ‘కార్తికేయ-2’ సినిమాతో ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయాడు. హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన సినిమా సంచలన వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిపోయింది.
దీని తర్వాత నిఖిల్ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ‘స్పై’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. ఈ మధ్యే దాని టీజర్ లాంచ్ అయింది. దేశభక్తితో ముడిపడ్డ ఆ కథ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది. దీని తర్వాత నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీని లైన్లో పెట్టాడు. అదే.. ‘ది ఇండియా హౌస్’. ఈ రోజే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు అనేక విశిష్టతలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యువి క్రియేషన్స్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు కలిపి కొత్త, యువ టాలెంట్‌ను ప్రోత్సహించడం కోసం నెలకొల్పిన ‘వి మెగా’ పిక్చర్స్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. ‘కార్తికేయ-2’, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలతో సంచలనం రేపిన అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమా కోసం వీరితో అసోసియేట్ అవుతున్నాడు.
‘ది ఇండియా హౌస్’ను రామ్ వంశీ కృష్ణ రూపొందించనున్నాడు. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం 1905 ప్రాంతంలో జరిగే కథ కావడం విశేషం. సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా చాలా రిచ్‌గా ఉంటుందన్న సంకేతాలు కనిపించాయి ఈ టీజర్లో. ఈ సినిమా వెనుక ఉన్న పేర్లు చూస్తే.. బడ్జెట్, ప్రమోషన్ అదీ కూడా వేరే లెవెల్లో ఉండబోతుందన్నది స్పష్టం. ఈ సినిమా క్లిక్ అయితే నిఖిల్ కెరీర్ వేరే లెవెల్‌కు వెళ్లిపోవడం ఖాయం.
This post was last modified on May 28, 2023 1:48 pm
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…