Movie News

శత జయంతి ప్రోగ్రాంకు రమ్మంటే తారక్ అలా చెప్పాడు

నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సందర్భంగా.. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అక్కినేని కుటుంబానికి చెందిన వారు.. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ తో పాటు.. పలువురు నటులు.. నటీమణులు హాజరయ్యారు. అందరూ వచ్చినా.. తారక్ మాత్రం గైర్హాజరు అయ్యారు.

తన పుట్టిన రోజు కావటంతో కుటుంబంతో తాను వేరే ప్రోగ్రాంకు అటెండ్ కావాలంటూ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై తాజాగా ఒక మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. తాజాగా ఆయన చెప్పిన మాటలు.. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. ఆయన తప్పు చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

హైదరాబాద్ లో తాము నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి బాలక్రిష్ణ.. రామ్ చరణ్.. నాగ చైతన్య.. వెంకటేశ్ దగ్గుబాటి.. శ్రీలీలా ఇలా చాలామంది వచ్చారని.. ఎన్టీఆర్ మాత్రం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఏదో టూర్ పెట్టుకున్నారని బదులిచ్చారు. తాను నందమూరి రామక్రిష్ణను తారక్ ను కలవాలని అడిగితే.. అడిగిన వారం తర్వాత మాకు అపాయింట్ మెంట్ వచ్చింది. వెళ్లి కలిశాం. నాకు ఆ రోజు టూర్ ఉంది అన్నా.. 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం.. రాలేను అని చెప్పాడు.

అప్పుడు మేము.. నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి. కానీ.. అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఉదయం అభిమానుల్ని కలిసేందుకు ఉంటానని చెప్పాడు. ఎలాగు ఉదయం ఉంటారు కదా. సాయంత్రం వరకు ఉండి ఆ ఫంక్షన్ కు వచ్చి వెళ్లండని చెప్పాము” అని ఏం జరిగిందో వివరించారు.
కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కుటుంబ టూర్ కు ప్రాధాన్యత ఇచ్చి.. తాతగారి ఫంక్షన్ కు డుమ్మా కొట్టారన్నారు. వందో పుట్టిన రోజు ఒక్కసారే వస్తుందని.. అది ఘనంగా చేసినప్పుడే అందరితో పాటు తారక్ ఉండి ఉంటే మంచి పేరు వచ్చేదన్నారు. ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఫంక్షన్ కు రాలేదు కదా? అంటే.. అతను కూడా తారక్ తో పాటు టూర్ కు వెళ్లి ఉండొచ్చు. అందుకే రాలేదేమో? అంటూ టీడీపీ నేత జనార్ధన్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

This post was last modified on May 28, 2023 11:29 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago