తమిళం కంటే తెలుగులోనే బిచ్చగాడు 2 బాగా వసూలు చేసిన విషయం కళ్ళముందు కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. రిలీజ్ కు ముందు పెద్దగా కనిపించిన ఆరున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కేవలం పది రోజుల్లోపే దాటేయడం ఆ బ్రాండ్ కి ఏపీ తెలంగాణలో ఎంత రీచ్ ఉందో స్పష్టం చేస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన వసూళ్ల లెక్కలో ఆల్రెడీ బయ్యర్లకు కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది . ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కాబట్టి మంచి లాభాలతోనే బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త రిలీజుల మిక్స్డ్ టాక్ ఎంతో కొంత బిచ్చగాడుకి హెల్ప్ అయ్యేలా ఉంది
ఇంత స్పందన ఊహించని దర్శకుడు కం హీరో విజయ్ ఆంటోనీ విస్తృతంగా పర్యటిస్తూ ప్రమోషన్ స్పీడ్ పెంచాడు. నిన్న రాజమండ్రిలోని ఖరీదైన ఫుడ్ గార్డెన్ రెస్టారెంట్ కు నిజమైన బిచ్చగాళ్లను తీసుకెళ్లి వాళ్లకు కడుపునిండా నాన్ వెజ్ భోజనం వడ్డించి, మురికివాడల పిల్లకు ఐస్ క్రీంలు తినిపించి తన అభిమానం చాటాడు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం తిరుపతిలో ఫుట్ పాత్ ల మీద ఆశ్రయం పొందే అనాధలకు, ముసలివాళ్లను స్వయంగా దుప్పట్లు శాలువాలు పంచాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళందరూ ఇతనితో సెల్ఫీలు దిగేస్తున్నారు.
ఇక్కడ రన్ బాగుండటం వల్లే విజయ్ ఆంటోనీ తన ఫోకస్ పూర్తిగా ఇక్కడే పెట్టాడు. ఇంకో వారం పది రోజులు ఇలాగే తిరిగితే హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా వెళ్లొచ్చు. పబ్లిసిటీ కోసమని చెప్పలేం కానీ విజయ్ చేస్తున్న ఈ పనులు నిజంగానే మంచి మనసుతో చేసినట్టు ఉన్నాయని వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. హీరోగా తనకో గుర్తింపు రావడానికి దోహదం చేసింది బిచ్చగాడే కాబట్టి నిజంగా అలాంటి వాళ్లకు సహాయం చేయడం గురించి మెచ్చుకుంటున్నారు. 2025లో విడుదలయ్యే బిచ్చగాడు 3 కోసం స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టేశాడు విజయ్ ఆంటోనీ.
This post was last modified on May 28, 2023 12:12 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…