ఒకప్పుడు టాలీవుడ్లో చాలా ప్రామిసింగ్‌గా కనిపించిన యువ కథానాయకుల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో వరుస హిట్లు కొట్టి పెద్ద స్టార్ అయ్యేలా కనిపించాడు ఉదయ్. కానీ తర్వాత తర్వాత సరైన సినిమాలు చేయకపోవడంతో ఫేడవుట్ అయిపోయాడు. చివరికి సినిమాల్లో అవకాశాలు లేకో, ఇంకేదో అసంతృప్తితోనో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు పెద్ద షాక్.
ఉదయ్ సుసైడ్ నోట్ అంటూ ఏదీ రాయకపోవడంతో అతడి ఆత్మహత్యకు ఇదీ కారణం అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఐతే ఉదయ్‌ను స్టార్‌ను చేసిన సీనియర్ దర్శకుడు తేజ మాత్రం.. అతనెందుకు చనిపోయాడో తెలుసని, సరైన సమయంలో ఆ విషయం వెల్లడిస్తానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆ విషయాన్నే ప్రస్తావిస్తే.. తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసిన వాళ్లు కూడా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని తేజ వ్యాఖ్యానించారు. ‘‘దాని గురించి నేను చెబుతాను. కానీ కొంతమంది ‘మీరే చెప్పండి’ అంటూ అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు’’ అని తేజ అన్నారు. ఉదయ్ కిరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని ఈ ఇంటర్వ్యూలో అడిగితే ‘‘పాపం’’ అని బదులిచ్చాడు తేజ.
ఇదిలా ఉండగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నానని.. అతను యాక్టింగ్, డైరెక్షన్ కోర్సులు కూడా పూర్తి చేశాడని తేజ తెలిపాడు. తన కూతురు ఫారిన్లో చదువుకుందని.. ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం తనకు లేదని.. ఎవరైనా నచ్చారని చెబితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురమ్మని తెలిసిన వాళ్లకు భోజనాలు పెట్టిస్తానని తేజ తేల్చేశాడు. పెళ్లి తర్వాత భర్తతో పొసగకపోతే నిమిషం కూడా ఆలోచించకుండా విడాకులు ఇచ్చేయాలని కూడా తాను తన కూతురికి సూచించినట్లు తేజ వెల్లడించడం విశేషం.
This post was last modified on May 26, 2023 1:43 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…