తెలుగులో హీరోల సోదరీమణులు దర్శకురాలు కావడం చూశాం. సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడ మంజుల ‘మనసుకు నచ్చింది’ అనే సినిమా తీసింది. ఇక నేచురల్ స్టార్ నాని సోదరి గంటా దీప్తి ‘మీట్ క్యూట్’ అనే వెబ్ ఫిలింతో దర్శకురాలిగా మారింది. వీళ్లిద్దరూ దర్శకులుగా అనుకున్నంత బలమైన ముద్ర అయితే వేయలేకపోయారు. కాగా ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ సోదరి దర్శకురాలు అవుతోంది.
ఆమెనే రేవతి సురేష్. రేవతి అనే పేరు పక్కన ఉన్న సురేష్ అనే పేరు చూస్తే.. ఆమె కీర్తి సురేష్ సోదరి అనే విషయం అర్థమవుతుంది. ఇప్పటిదాకా లైమ్ లైట్లో లేని ఈ అమ్మాయి.. దర్శకురాలిగా పరిచయం కాబోతుండటం విశేషమే. ఐతే ఆమె డైరెక్టర్‌గా మారుతోంది ఫీచర్ ఫిలింతో కాదు.. షార్ట్ ఫిలింతో. దాని పేరు.. థ్యాంక్ యు.
తన సోదరి దర్శకత్వం వహిస్తున్న షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘Thank U’ అనే టైటిల్లో U అక్షరాన్ని టీ కప్పులా చూపించారు. అలాగే కింద రెండు జతల చెప్పులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక జంట టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే క్రమంలో నడిచే కథలా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది.
దీని గురించి కీర్తి స్పందిస్తూ.. ‘‘ఈ స్వీట్ షార్ట్ ఫిల్మ్‘థ్యాంక్ యు’తో నా సోదరి దర్శకురాలిగా ఎట్టకేలకు అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. రేవతి.. నీకు బోలెడంత ప్రేమ.. కౌగిలింతలు పంపుతున్నా’’ అని కామెంట్ చేసింది. సురేష్ కుమార్, నితిన్ మోహన్ నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే విడుదల కానుంది. కీర్తి, రేవతిల తల్లి మేనక ఒకప్పుడు ప్రముఖ నటి కాగా.. తండ్రి సురేష్ మలయాళంలో పెద్ద ప్రొడ్యూసర్.
This post was last modified on May 26, 2023 12:46 pm
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…