హారర్ జానర్ లో రూపొందినా బ్లాక్ బస్టర్ వసూళ్లతో వంద కోట్ల గ్రాస్ సాధించిన విరూపాక్ష ఇటీవలే ఓటిటిలో వచ్చేసి థియేట్రికల్ గా ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. కొన్ని చోట్ల డీసెంట్ రెవిన్యూ వస్తున్నా అదేమీ భారీ మొత్తం కాదు. దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తాజాగా దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష స్క్రిప్ట్ లో సుకుమార్ చేసిన మార్పుల గురించి అవి ఫైనల్ అవుట్ ఫుట్ లో ఎంత దోహదపడ్డాయో వివరించి చెప్పడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది.
ఒక సీనియర్ అనుభవం ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో అర్థం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చేతబడులు చేస్తున్న అసలు విలన్ ఎవరనేది క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా హఠాత్తుగా హీరోయిన్ సంయుక్త మీననే ఇదంతా చేసిందని చూపించడం ఆడియన్స్ ని షాక్ కి గురి చేసింది.
వాస్తవానికి కార్తీక్ ముందు రాసుకున్నది పార్వతి క్యారెక్టర్ చేసిన యాంకర్ శ్యామలని విలన్ ని చేయడం. ఆ ప్రకారమే ట్రీట్ మెంట్ సిద్ధం చేసుకున్నారు. అలా అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, చూసేవాళ్ళకు ఊహాతీతంగా ఉండాలంటే నందినికి ట్విస్టు పెట్టడమే కరెక్టని గుర్తించి దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే మార్చడంతో టోటల్ టోన్ మారిపోయింది
ఒకవేళ శ్యామలనే విలన్ గా చూపించి ఉంటే సుకుమార్ చెప్పినట్టు ఇంత థ్రిల్ ఖచ్చితంగా దక్కేది కాదు. పైగా చివరి ఘట్టంలో వచ్చే సీన్లు ఈ స్థాయిలో పండకపోయేవి. ఇదంతా గెస్ చేయగలిగారు కాబట్టి సుక్కు మార్కు విరూపాక్షలో బలంగా పని చేసింది. ఏది ఏమైనా ఇలాంటి హారర్ థ్రిల్లర్స్ లో అసలు హంతకులు ఎవరన్నది ముందే పసిగట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో విరూపాక్ష టీమ్ వంద శాతం సక్సెస్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక వ్యూస్ భారీగా వస్తున్నాయట. కార్తీక్ దండు సీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.
This post was last modified on May 25, 2023 11:13 am
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…