మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ఏకంగా రాజమండ్రి బ్రిడ్జ్ ని లాక్ చేయడంతో పాటు రైలుబండిని ఆపి మరీ అంతెత్తు నుంచి బ్యానర్ ని వందలాది ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు చూస్తుండగా వదలడం ఇదే మొదటిసారని చెప్పాలి. రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరిగే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఈసారి రాజమహేంద్రవరంలో చేశారు. అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా థీమ్ ఏంటో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ లో రివీల్ చేస్తూ రవితేజని చూపించారు.
1970 ప్రాంతంలో దక్షిణాది భారతదేశం మొత్తం భయపడిన ఊరు స్టువర్ట్ పురం. అక్కడ పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు. అందరూ అతన్ని టైగర్ అని పిలుస్తూ ఉంటారు. దోపిడీలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. మైలురాయి ఒక కిలోమీటర్ ఉండగానే ట్రైన్ వణికిపోతుంది. అంతగా దాడులు జరుగుతాయి. అసలు వాళ్లంతా ఎందుకు ఇలా చోరీలకు తెగబడ్డారు, నాగేశ్వరరావు అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి దోహదం చేసిన కారణాలు, సంఘటనలు, ప్రభుత్వాలు ఏం చేశాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకో అయిదు నెలలు ఆగాల్సిందే
జస్ట్ ఫస్ట్ లుక్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్, క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు . ఇంకా చాలా టైం ఉంది కనక దీంతో సరిపెట్టారు. నోటి పళ్ళ మధ్యలో ఊచలు పెట్టుకుని చూస్తూన్న రవితేజ లుక్, పులుల్ని వేటాడే పులిని చూశారా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి మంచి ఊపిచ్చేలా ఉన్నాయి. పీరియడ్ డ్రామా కావడంతో అప్పటి వాతావరణాన్ని చక్కగా ప్రెజెంట్ చేశారు వంశీ. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా అసలైన గెటప్ ఇంకా షాకింగ్ గా ఉండబోతుంది. దాన్ని పూర్తిగా చూపించలేదు. బోలెడు సమయం ఉందిగా
This post was last modified on May 25, 2023 6:48 am
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…