Movie News

బిచ్చగాడు-2.. అతను తీసి ఉంటే


ప్రోమోలు బాగా లేవు. పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. సినిమాకు టాక్ బాగా లేదు. ఇలాంటి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఉపోద్ఘాతం ‘బిచ్చగాడు-2’ గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది. గత శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో సాగిపోతోంది. తొలి వీకెండ్లో తెలుగు వరకే ఈ చిత్రం రూ.10 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. తమిళంలో అంతకుమించి వసూళ్లు వచ్చాయి. వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. దీంతో పాటుగా రిలీజైన ‘అన్నీ మంచి శకునములే’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో ‘బిచ్చగాడు-2’ డామినేషన్ కొనసాగుతోంది.

నిజానికి కంటెంట్ పరంగా చూస్తే ‘బిచ్చగాడు-2’ బాగా వీక్. కానీ ‘బిచ్చగాడు’ బ్రాండ్ దీనికి బాగా కలిసొచ్చింది. ఏడేళ్ల కిందట ఆ సినిమా చూసి ప్రేక్షకులు కదిలిపోయారు. కొన్ని వారాల పాటు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివచ్చి సినిమాకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు.

సరైన కథ.. బలమైన కథనం లేని సినిమాను జనం ఇంతగా నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకవేళ ‘బిచ్చగాడు’ దర్శకుడు శశినే ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటే.. ఫస్ట్ పార్ట్ లాగే దీన్ని కూడా హృద్యంగా తీర్చిదిద్ది ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచన ఎగ్జైట్ చేసేదే. ‘బిచ్చగాడు’ సక్సెస్‌లో విజయ్ ఆంటోనీ పాత్ర తక్కువే. ఆ పాత్రలో ఇంకో నటుడెవరైనా చేసినా పెద్దగా తేడా ఉండేది కాదు. ఆ సినిమా బలమంతా.. కాన్సెప్ట్, ఎమోషన్లలోనే ఉంది.

శశి గతంలో సొల్లామలే (తెలుగు రీమేక్-శీను), రోజా కూట్టం (తెలుగు డబ్బింగ్-రోజా పూలు), పూ లాంటి హృద్యమైన సినిమాలు తీశాడు. ‘బిచ్చగాడు’ ఆయన కెరీర్లో ది బెస్ట్‌గా నిలిచింది. ఆయనతో పోలిస్తే దర్శకుడిగా ‘బిచ్చగాడు-2’లో విజయ్ ఆంటోనీ చేసింది పెద్దగా ఏం లేదు. కేవలం అతను ఆ బ్రాండ్‌ను వాడుకున్నాడంతే. ఇద్దరికీ ఎక్కడ చెడిందో ఏమో కానీ.. ‘బిచ్చగాడు-2’ను తనే స్వయంగా డైరెక్ట్ చేశాడు విజయ్. అలా కాకుండా శశికే ఈ సినిమాను కూడా అప్పగించి ఉంటే.. అతను తనదైన శైలిలో హార్ట్ టచింగ్‌గా సినిమాను తీసి ఉంటే.. ‘బిచ్చగాడు-2’ కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేదేమో.

This post was last modified on May 24, 2023 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

1 hour ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago