చిన్న బ్రేకులు తప్పించి ఎక్కువ గ్యాప్ రాకుండా క్రమం తప్పకుండా పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద మైత్రి మేకర్స్, దర్శకుడు సుకుమార్ మల్లగుల్లాలు పడుతున్నారు. మొదటి భాగం వచ్చింది 2021 డిసెంబర్ లో. టాలీవుడ్ కు డ్రై మంత్ కావడంతో తెలుగు వెర్షన్ కు భారీ స్థాయిలో రికార్డు వసూళ్లు రాలేదు. నార్త్ లో ఆడటం వల్లే బ్లాక్ బస్టర్ రేంజ్ ని దాటేసింది. దానికి తోడు ఇరవై రోజులకే ఓటిటికి ఇచ్చేయడం వల్ల సంక్రాంతికి కిల్ అయిపోయింది. ఇదంతా జరిగిపోయిన చరిత్ర. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదు.
పుష్ప 2 ది రూల్ ని ఏడాది చివర్లో వదిలితే ఈసారి రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆపై 2024 సంక్రాంతికి చాలా క్రేజీ సినిమాలు వస్తున్నాయి, అప్పుడు ఆటోమేటిక్ గా బన్నీ సినిమాని థియేటర్ల నుంచి తీయాల్సి ఉంటుంది. కనీసం నెల రెండు నెలలు ఆడే స్టామినా ఉన్నపుడు ఎందుకు అవసరం లేని డేట్ తీసుకోవడమనేది ఒక వెర్షన్. పోనీ సమ్మర్ చూద్దామంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5 ఆల్రెడీ లాక్ చేసుకుంది. గేమ్ చేంజర్ కూడా వేసవినే. అఫీషియల్ గా డేట్ రావడం ఒకటే పెండింగ్. వీటితో వీలైనంత క్లాష్ లేకుండా చూసుకోవాలి.
ఇవన్నీ ఒక ఎత్తయితే బాలీవుడ్ లోనూ సానుకూల సమయంలో రిలీజ్ చేసుకోవాలి. అప్పుడే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పెద్ద స్టార్లు ఎవరూ అనౌన్స్ మెంట్లు ఇవ్వలేదు. హృతిక్ రోషన్ ఫైటర్ జనవరిలో, షారుఖ్ ఖాన్ డుంకీ మార్చ్ లేదా ఏప్రిల్ లో వచ్చే ఛాన్స్ ఉంది. వాటితో తలపడటం సేఫ్ కాదు. ఈ లెక్కలన్నీ చూసుకునే డిసెంబరా లేక సమ్మరా అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. షూటింగ్ బాలన్స్ అయితే ఇంకా బోలెడుంది. ఆర్టిస్టుల కాంబినేషన్లతో డేట్లు దొరకడం పెద్ద సమస్య అయ్యింది. ఇది పూర్తయ్యాకే బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్లో అడుగు పెడతాడు.
This post was last modified on May 24, 2023 12:53 pm
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…