చిన్న సినిమాలు థియేటర్లకు జనాన్ని రప్పించాలంటే ఆషామాషీ కాదు. ఎన్ని ప్రమోషన్లు చేసినా ఉదయం ఆటకు కొంత మేరకు రాబట్టగలరు కానీ ఫస్ట్ డే నాలుగు షోలకు పబ్లిక్ నిండాలంటే ఏదోకటి అనూహ్యంగా ఉండాలి. 26న రిలీజ్ కాబోతున్న మేం ఫేమస్ టీమ్ అదే చేయబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ ధర కేవలం 99 రూపాయలే ఉంచబోతున్నారు. ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏపీ తెలంగాణలో సగటు రేట్ 110తో మొదలుకుని 295 దాకా ఉంది. అలాంటప్పుడు ఇంత భారీ డిస్కౌంట్ అంటే మెచ్చుకోదగిన విషయమే
కేవలం ఒక్క రోజుకే పరిమితం చేయడం వెనుక స్ట్రాటజీ ఉంది. తక్కువ రేట్ ఉందని ఎలాగూ అధిక శాతం యూత్ సినిమాని చూసేస్తారు. వాళ్ళ నుంచి టాక్ కనక పాజిటివ్ గా సోషల్ మీడియాలో, బయట ఇతర వర్గాల్లో వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా పికప్ పెరుగుతుంది. జాతిరత్నాలు, బలగం లాంటి వాటికి జరిగింది ఇదే. అయితే మేం ఫేమస్ లో ఎలాంటి ప్రత్యేక ఆకర్షణలు లేవు. అందరూ కొత్తవాళ్లే. హీరో కం దర్శకుడు సుమంత్ ప్రభాస్ కి ఇదే డెబ్యూ. అలాంటప్పుడు సమ్ థింగ్ స్పెషల్ అనిపించేది చేయాలి. అందుకే ఈ తొంభై తొమ్మిది రూపాయల రూటు పట్టేశారు
గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ కు ఒక రోజు మహిళలకు ఉచిత ప్రదర్శనలు చేసి సక్సెస్ అయిన టీమ్ అంతకు ముందు మేజర్ కి ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేయించి గొప్ప ఫలితం అందుకుంది. మరి మేం ఫేమస్ కి ఇలా షోలు వేస్తారో లేదో తెలియదు కానీ మొత్తానికి అటెన్షన్ రాబట్టుకోవడానికి వేసిన ప్రతి ఎత్తుగడ క్రియేటివ్ గా ఉంది. మళ్ళీ పెళ్లి, 2018తో పోటీ పడబోతున్న ఈ కూల్ ఎంటర్ టైనర్ మీద ప్రస్తుతానికి భారీ అంచనాలు లేవు కానీ కంటెంట్ ని నమ్ముకున్నప్పుడు ఓపెనింగ్స్ ని వాడుకుంటే చాలు సినిమా నిలబడిపోతుంది. చూడాలి మరి ఏం చేస్తుందో
This post was last modified on May 23, 2023 4:47 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…