Movie News

సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

ఒకేసారి ఇండియన్ 2, గేమ్ చేంజర్ లను డీల్ చేస్తున్న దర్శకుడు శంకర్ పుణ్యమాని రామ్ చరణ్ కు మంచి ఫ్రీ స్పేస్ దొరుకుతోంది. నిన్న జి20 సదస్సుకు ఫిలిం టూరిజం తరఫున అతిథిగా వెళ్లడం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యింది. విదేశీ ప్రతినిధులతో మంతనాలు, స్టేజి మీద నాటు నాటు స్టెప్పులు, కేంద్ర మంత్రి ఇచ్చిన ఎలివేషన్లు వగైరా మాములు వైరల్ అవ్వలేదు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుని ఆనందాన్ని పంచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ అంటూ పలువురు ప్రస్తావించడాన్ని హైలైట్ చేస్తూ వీలైనంత ట్రెండింగ్ జరిగేలా చూసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఫేమ్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నది చరణే. ఒకపక్కా జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి అత్యవసరమైతే తప్ప బ్రేక్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో పాటు పుట్టినరోజు కారణంగా మొన్న తాతయ్య శతజయంతి ఉత్సవాలకు వెళ్లలేకపోవడం గురించి ఎన్ని కథనాలు వస్తున్నాయో చూడలేక లేదు. అయినా తప్పని పరిస్థితి. ఇలాంటి ఇబ్బంది చరణ్ కు లేదు. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజో ఇంకా ఎవరికీ తెలియదు. 2024 సంక్రాంతినా లేక వేసవినానేది నిర్మాత దిల్ రాజు సైతం చెప్పలేకపోతున్నారు

అలాంటపుడు ఒత్తిడి ఉండదు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం చరణ్ పూర్తిగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ పూర్తయితే తప్ప అది జరగదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆహ్వానాలు ఏవి వచ్చినా ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా చరణ్ హ్యాపీగా ఎస్ చెప్పేస్తున్నాడు. ఇది ఏ కోణంలో చూసినా తన ఇమేజ్ ని పెంచేదే. జి20కి దిల్ రాజు కూడా వెళ్లారు. కిషన్ రెడ్డితో కలిసి సందడిగా తిరిగారు. డ్రైగా ఉన్న టైంలో చరణ్ కు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే. స్పీచుల్లో మెచ్యూరిటీ బాగా పెరుగుతున్న మాట వాస్తవం

This post was last modified on May 23, 2023 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోదీ ఊరికి చైనా అధ్యక్షుడితో అనుబంధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…

2 hours ago

మోకాళ్లపై వెంకన్న చెంతకు టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…

2 hours ago

బన్నీకి ఫుల్ రిలీఫ్ దొరికేసింది!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…

4 hours ago

ప్రభాస్ పెళ్లి సస్పెన్స్ తీరబోతోందా

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…

4 hours ago

పండుగ పూట ఈ ట్రోలింగ్ ఏంటబ్బా…?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…

5 hours ago

మోక్షజ్ఞ కోసం ఎదురుచూపులు ఎప్పటిదాకా

గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…

5 hours ago