ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి నేటివ్ అమెరికన్స్ స్పందించిన తీరు.. స్టీఫెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది లెజెండరీ హాలీవుడ్ ప్రముఖులు ఆ చిత్రాన్ని కొనియాడిన వైనం అసాధారణం.
అంత గొప్ప విజయం సాధించిన సినిమాలో విలన్‌గా అద్భుత అభినయాన్ని ప్రదర్శించి అందరి మెప్పూ పొందిన రే స్టీవెన్సన్ హఠాత్తుగా మరణించడం పెద్ద షాకే. బ్రిటిష్ దొర స్కాట్‌గా స్టీవెన్సన్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా అప్పటి బ్రిటిష్ దొర ఇలాగే ఉండి ఉంటాడేమో అనిపించేలా స్టీవెన్సన్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రాజమౌళి ఈ పాత్ర కోసం ఆయన్ని ఎంచుకోవడంపైనా ప్రశంసలు కురిశాయి. ఈ నటుడు ఇటలీలో ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ కన్ను మూశాడు. ఆయన వయసు 58 ఏళ్లు.
రే స్టీవెన్సన్ మరణానికి కారణమేంటో ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో బయటికి రావచ్చు. ఐరిషన్ నటుడైన రే స్టీవెన్సన్ ఇంకో ఐదు రోజుల్లో తన 59వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది. ఇంతలో ఆయన మరణవార్త వినాల్సి రావడం.. ‘ఆర్ఆర్ఆర్’ టీంకు, అలాగే ఈ సినిమాలో రే పాత్రను ఇష్టపడ్డ వాళ్లందరికీ పెద్ద షాకే. 1998లో ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ అనే సినిమాతో 33 ఏళ్ల వయసులో తన సినిమా కెరీర్ మొలుపెట్టారు.
2008లో వచ్చిన ‘ఔట్ పోస్ట్’ ఆయన లీడ్ రోల్ చేసిన తొలి చిత్రం. ‘థోర్’, ‘డివర్జెంట్ ఫిల్మ్స్’, ‘వైకింగ్స్’, ‘స్టార్ వార్స్’ లాంటి ప్రఖ్యాత చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇంత పేరున్న నటుడికి ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి అద్భుతమైన పాత్రను ఇవ్వగా.. దాన్ని అంతే గొప్పగా పోషించాడు. తెరమీద ఒక విలన్ పాత్రను చూసి అసహ్యించుకుని దాని పతనాన్ని గట్టిగా కోరుకున్నామంటే ఆ క్యారెక్టర్ గొప్పగా పండినట్లే. ఈ విషయంలో రే స్టీవెన్సన్ పూర్తి న్యాయం చేసినట్లే.
This post was last modified on May 23, 2023 10:11 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…